మంచు తెమ్మరని శిరస్సుపై ధరించి
తల వంచుకుని ఎవరూ లేని
ఈ రాత్రి దారులని ఒంటరిగా
దాటుతావు నువ్వు - నువ్వే
హృదయంలో ఒక రహస్య దీపం
వెలిగించుకుని, అరచేతులలో
ఒక చలి మంటని రాజేసుకుని
ఏనాటి జ్ఞాపకాలతో ఒక్కడివే -
ఈ దారిని కాస్త తెరిపిగా
దాటేందుకు సాగేందుకు
నా పక్కన నువ్వు ఉంటే
ఎంత బావుండేది ఈ లోకం బ్రతికి ఉండేందుకు!
రాత్రంతా నాది ఇదే పరిస్థితి
ReplyDeleteమీకెలా తెలిసిందో మరి
హృదయంలో ఒక రహస్య దీపం
వెలిగించుకుని, అరచేతులలో
ఒక చలి మంటని రాజేసుకుని
ఏనాటి జ్ఞాపకాలతో ఒక్కడివే -