ఒక ముంత. కొన్ని నీళ్ళు.
ఇక్కడ వాలే మబ్బులు, పిచ్చుకలు- వాటి మెడ కిందటి
మెత్తటి నూనుగు సాయంత్రంలో
నువ్వు. ఒక వడ్ల గింజ - నువ్వు -
నీకై
గింజలతో చాచిన అపరచితుని
అరచేయి- ఇది. అది నేను. మెడ కింది ఆ చిన్ని కుత్తుక తెగి
అక్కడే ఉబికి, ఇక
ఇక్కడ రాలలేని ఓ
నెత్తురు చినుకు - నేనూ, నువ్వూ - (మనం). చెప్పు నాకు
ఎలా తెలుస్తుంది నీకూ నాకూ - ఉన్నామని మనం - మన కళ్ళకీ
కనీళ్ళతో అవి
తెగని దాకా-?
- Oh, hear: here, O blue blue One of the none -
ఒక అశ్రువు బరువుతో ఆగిపోయిందీ రాత్రి. అందుకే
రెప్పలను తెరచి
విగతమైన కను
పాపలమై ఉంచు
ఈ చిన్ని పదాన్ని. రేపు, ఇక రేపు మనం
ప్రేఏమని గురించి
మాట్లాడుకుందాం-

No comments:
Post a Comment