ఏముంది ఇక్కడ? నీకు చెప్పటానికైతే, ఏమీ లేవు-
నిదురించిన పాప కురులని ఆప్తంగా సవరించినట్టు
ఈ గాలిని నిమిరితే, నీ అరచేతులకి
అంటుకునే ఒక చీకటి: చల్లని చీకటి-
పిల్లల పెదాలపై, ఒక పాల తడి మిగిలిపోతుందే, అలా
రాత్రిలో మెరిసే నక్షత్రాల కాంతి. నిన్ను
రెండు చేతులు లాక్కుని, గుండెలోకి
పొదుపుకున్నట్టు,మనిషి వాసన వేసే
గాలి. నీ శరీరానికీ తనదైన ఒక ఆవరణ ఉంటుంది కదా:
దానిలో, చిన్నగా మరి ఎవరివో పాదాల
సవ్వడి. ఒక గడ్డి పరక నీటిలో తేలినట్టు
ఎవరివో మరి మాటలు- రాలే ఆకులను
తప్పించుకుని వచ్చి, ఇక అతి చిన్నగా
నీ గదిలో రెపరెపలాడే పల్చటి కాంతీనూ-
నిజమే. నిజానికి ఏముంది ఇక్కడ,నువ్వు
తాకటానికీ, తిరిగి రావడానికీ, తిరిగి వచ్చి
చూడటానికీ? తిరిగి విశ్లేసించుకోవడానికి?
నిదురించే పిల్లలు. నిదురించని నీడలు.పిల్లల వంటి నీడలలో
నీడల పిల్లలమై కూర్చున్న నువ్వూ నేనూ-
మరి చిన్నా, దీని అంతటి తరువాతా, ఇది
'ప్రేమ' అని మనకి మనం చెప్పుకోవాల్సిన
అవసరమూ, ఆగత్యమూ ఏమిటి మనకు?
నిదురించిన పాప కురులని ఆప్తంగా సవరించినట్టు
ఈ గాలిని నిమిరితే, నీ అరచేతులకి
అంటుకునే ఒక చీకటి: చల్లని చీకటి-
పిల్లల పెదాలపై, ఒక పాల తడి మిగిలిపోతుందే, అలా
రాత్రిలో మెరిసే నక్షత్రాల కాంతి. నిన్ను
రెండు చేతులు లాక్కుని, గుండెలోకి
పొదుపుకున్నట్టు,మనిషి వాసన వేసే
గాలి. నీ శరీరానికీ తనదైన ఒక ఆవరణ ఉంటుంది కదా:
దానిలో, చిన్నగా మరి ఎవరివో పాదాల
సవ్వడి. ఒక గడ్డి పరక నీటిలో తేలినట్టు
ఎవరివో మరి మాటలు- రాలే ఆకులను
తప్పించుకుని వచ్చి, ఇక అతి చిన్నగా
నీ గదిలో రెపరెపలాడే పల్చటి కాంతీనూ-
నిజమే. నిజానికి ఏముంది ఇక్కడ,నువ్వు
తాకటానికీ, తిరిగి రావడానికీ, తిరిగి వచ్చి
చూడటానికీ? తిరిగి విశ్లేసించుకోవడానికి?
నిదురించే పిల్లలు. నిదురించని నీడలు.పిల్లల వంటి నీడలలో
నీడల పిల్లలమై కూర్చున్న నువ్వూ నేనూ-
మరి చిన్నా, దీని అంతటి తరువాతా, ఇది
'ప్రేమ' అని మనకి మనం చెప్పుకోవాల్సిన
అవసరమూ, ఆగత్యమూ ఏమిటి మనకు?
Beautiful feel!
ReplyDelete