నువ్వు నా ఎదురుగా కూర్చున్నప్పుడు, ఆనాడు నీ కళ్ళల్లో హోరున చెట్లు వీచాయి. శరవేగంగా మబ్బులు కమ్ముకోగా, ఎవరో వచ్చి గదిలోని దీపం వొత్తిని తగ్గించినట్టు, నెమ్మదిగా మందగించిన ఆ వెలుతురులో, తుంపర మొదలయ్యింది. బయట కొమ్మల్లో అలజడిగా మెసిలాయి పక్షులు. అవి
ఈ బల్లపై నా చేతులని తాకాలని వాలి మళ్ళా అంతలోనే, ఎందుకో సంశయంగా ఆగిపోయిన, నీ అరచేతులూ కావొచ్చు. నీ తనువేమో, అకారణంగా మందలింపబడి, ఇక గుమ్మంలోనే నిలబడిపోయిన ఓ పాపాయి కావొచ్చు. నీ కనుపాపాలపై పేరుకుంటున్న పదునైన చెమ్మా కావొచ్చు. చిన్నబోయిన నీ ముఖం కావొచ్చు. ఆ ముఖంపై లతల్లా ఊగే, నేను మరచిపోయిన 'నువ్వు' అనే స్వప్నఛాయలు కావొచ్చు. అవే
నీ పెదాలపై, అస్పష్టంగా తార్లాటలాడి మళ్ళా అంతలోనే ఆగిపోయే పదాలు- 'నువ్వు', 'నేను', అనే మన మాటలు.
సరే. సరే. అది సరే కానీ, తోటలోకి అడుగుపెట్టినట్టు, ఒక మనిషిలోకి అడుగుపెట్టి, ఒళ్లంతా ముళ్ళతో నెత్తురు తెమ్మరై, తామరపూల కొలనులో రాలిపోయి ఒంటరిగా చనిపోయిన ఓ దేవతా స్త్రీ కథను విన్నావా ఇంతకు మునుపు ఎన్నడైనా? ఆహ్:మరేం లేదు.
నీ నిశ్శబ్ధం మాట్లాడిన అరచేతుల భాష వ్యాపిస్తోంది ఇక్కడ- ఎలా అంటే, ఆరిన దీప ధూప పరిమళం, చీకట్లో ఓ జ్వాలస్మృతిని రగిలించినట్లుగా-
ఇక మాట్లాడుకోవచ్చా మనం? మనం అనే మనని?
Srikanth, 'నిశ్శబ్ధం' chadavagaane,
ReplyDeleteee kinda vunna poem (eppudo raasindi) gurthukochchindi.
నువ్వు నిశ్చబ్దమైన వేళ !
-----------------
నువ్వు నిశ్చబ్దమైనపుడు నాలో నువ్వు శబ్దమవుతున్నావ్!
గుండె గగనతలమంతా ఎడతెగని మహా విస్ఫోటనాలతో పగులుతున్నపుడు,
విశ్వాంతరాళాల్లోకి నల్లని వానరాతిరిలా పరుచుకుంటోన్న యేదో రహస్యం లాంటి నిశ్చబ్దం.
జీవితానికావలితీరాలనుంచి స్తబ్దతా గీతాలు నిశ్చబ్దంగా ప్రవహిస్తో
శబ్దం నిశ్చలమవుతో నిశ్చబ్దమై నన్ను ఆపాదమస్తకం అలుముకుంటోంది.
చెలీ!
ఏ నిశ్చబ్దశబ్ద ప్రకంపనాల మధ్య
ఏమిటి నీకళ్లు చెమ్మగిల్లుతున్నాయ్.
నువ్వూ నేననే మహా రూపోత్సవపు స్వప్నాలన్నీ శబ్దమవుతున్న వేళ
నీ నిశ్చబ్ద మహా భినిష్క్రమణం వేళ కాని వేళ !
దహాస్!
నువ్వు నిశ్చబ్దమైన వేళ
నా గుండె దహించిన మృత్యు హేల .
------------------------
Sridhar