Oh You
A blue blue one here: ఓహ్, hear
నీ పాదాల మధ్య ఉద్యానవనంలో ఈ ప్రార్ధన.
నీ అరచేతుల్లోంచి కురిసే
ఈ నీలం వాన- చూడు
నీలో
గుబురుగా నిక్కబొడుచుకునే కాంతి చీకటి ఇది-
నువ్వు తెరిస్తే కిటికీ
దాచేసుకుంటుంది
రాత్రుళ్ళ వాసనని- Oh You, hear...
రెప్పల్ని మూసిన కళ్ళతో
చూడు
మళ్ళా
-ఈ ద్రవ్య కాంతిలో ఊగే కొన్ని లక్షల గులాబీలని-
అవే
అవే
అవే
నిన్ను కౌగలించుకుంటాయి
ముద్దులు పెట్టుకుంటాయి
నీకు శరీరం లేకుండా చేసి
రోమాల రోజాల నీలి భాషని సృష్టిస్తాయి. స్నానిస్తాయి-
Oh You, a blue blue one here: hear, ఈ
అనుదిన, వర్ధమాన దైవప్రార్ధనను-
ప్రేమా అని అడగకు
పాపం అని అడగకు
ఏడవ రోజే మొదటి దినము మనకు
ఈ కర్కశ కాల ఆలయంలో- దా-
మరి నీ అరచేతులలోని వానకి
మొలకెత్తిన ఒక చిగురాకు
మోకరిల్లి అర్ధిస్తున్న ప్రార్ధన వద్దకి- మన వద్దకి - ఈ
లిపి వద్దకి
ఇక్కడికీ
అక్కడికీ...
-ఇక శరీరం లేకుండా ప్రేమించలేను నిన్ను ఎప్పటికీ-
ఆmen.
A blue blue one here: ఓహ్, hear
నీ పాదాల మధ్య ఉద్యానవనంలో ఈ ప్రార్ధన.
నీ అరచేతుల్లోంచి కురిసే
ఈ నీలం వాన- చూడు
నీలో
గుబురుగా నిక్కబొడుచుకునే కాంతి చీకటి ఇది-
నువ్వు తెరిస్తే కిటికీ
దాచేసుకుంటుంది
రాత్రుళ్ళ వాసనని- Oh You, hear...
రెప్పల్ని మూసిన కళ్ళతో
చూడు
మళ్ళా
-ఈ ద్రవ్య కాంతిలో ఊగే కొన్ని లక్షల గులాబీలని-
అవే
అవే
అవే
నిన్ను కౌగలించుకుంటాయి
ముద్దులు పెట్టుకుంటాయి
నీకు శరీరం లేకుండా చేసి
రోమాల రోజాల నీలి భాషని సృష్టిస్తాయి. స్నానిస్తాయి-
Oh You, a blue blue one here: hear, ఈ
అనుదిన, వర్ధమాన దైవప్రార్ధనను-
ప్రేమా అని అడగకు
పాపం అని అడగకు
ఏడవ రోజే మొదటి దినము మనకు
ఈ కర్కశ కాల ఆలయంలో- దా-
మరి నీ అరచేతులలోని వానకి
మొలకెత్తిన ఒక చిగురాకు
మోకరిల్లి అర్ధిస్తున్న ప్రార్ధన వద్దకి- మన వద్దకి - ఈ
లిపి వద్దకి
ఇక్కడికీ
అక్కడికీ...
-ఇక శరీరం లేకుండా ప్రేమించలేను నిన్ను ఎప్పటికీ-
ఆmen.
No comments:
Post a Comment