నీ చేతిలో రాళ్ళు ఉంటాయి. నీకేమో మరి అవి పువ్వులు-
నీడలు ఊయలలు ఊగే వేళల్లో, ఆకులు రెపరెపలాడి
నీ ముఖాన్ని తాకి రాలే
క్షణాలలో, ఒక ఆనందం
నీకు: ఆ పూవులని నలుగురికీ చూయించాలని, అద్రుశ్య
ధూపం అల్లుకునే వాటి
సువాసనని అందరికీ
పంచాలనీ, నవ్వాలనీ-
అమ్మల గన్న అమ్మా
ఓ, పిచ్చి మాయమ్మా
చూసుకున్నావా మరి అద్దంలో, నువ్వు ఇచ్చిన పూలతో
వాళ్ళు నిన్ను మోదితే
నెత్తురోడే, నీ పెదాలనీ
నువ్వు రాసే పదాలనీ?
తల్లీ, అంత తొందరగా
మనుషుల్నినమ్మకు
ఈ కవులను, అసలే...

No comments:
Post a Comment