నీ నిద్ర నీడ ఇక్కడ -
నీ కలలోంచి కురిసే వాన. వానలోంచి సాగిన
నీ చేయి
నన్ను అందుకుని
తెగిన పూవుని పూలపాత్రలోంచి తీసి తిరిగి
మొక్కకి
అద్ది బ్రతికించినట్టు
నువ్వు నా నిద్రని ముద్దాడితే
ఊగుతోంది హాయిగా నీ శరీరపు వాసనలో, ఈ శరీరం-
మంచుకి
తడచిన పచ్చిక
చిన్నగా వాలినట్టు, చీకటి బరువుకి చిగురాకులు
మెల్లిగా
ముడుచుకున్నట్టు
ఇక మనం: O One, O No One, Oh
Blue blue One
Of the None...
నిద్రి కింది కళ్ళల్లో, కళ్ళ కింది ఆకాశంలో
చల్లగా, మెల్లిగా తేలే
నీ వెన్నెలా, నీ వానా-
- వానలో అలలలపై ముసురులో ఈ నవ రంధ్రాల పూల నావ-
- చూడు: విదిలించబోకు -
నిన్ను కావలించుకుని నోరు తెరుచుకుని నిదురపోయే
ఈ పసి రాయిని-

:) nice.
ReplyDelete