చెప్పటానికి ఏమీ లేదు: నీ వద్దా, నా వద్దా- అందుకని ఇక
నీ హృదయాన్ని తొలగించి చూద్దును కదా
పూల సువాసనతో విచ్చుకునే
ఒక రంగు లేని రాయి అక్కడ- (అదే)
చెమ్మగిల్లి, సమాధిలో ఒత్తిగిల్లి
మొలకెత్తబోయే చిగురాకుతో
కదులాడే, పసినయనం వంటి
విత్తనం, రాయీ అక్కడ. 'అ. రాయి. అక్కడ'- అదే (నువ్వు)
అన్నది, నీ తలుపులు తెర
చాపిన నాడు. అందుకనిక
నావని చీల్చే నీటిని తొలగించి చూద్దును కదా, అప్పటికేమన
పెదాల అంచున
పుష్ప గుచ్చాన్ని
ఉంచి, తొలిగారు
ఎవరో. మరి ఇక
వొత్తి లేని ఒక దీపం
రాత్రంతా ఇక నిప్పు(/లేని/) నిశ్శబ్ధంతో మాట్లాడటం ఎలా?
నీ హృదయాన్ని తొలగించి చూద్దును కదా
పూల సువాసనతో విచ్చుకునే
ఒక రంగు లేని రాయి అక్కడ- (అదే)
చెమ్మగిల్లి, సమాధిలో ఒత్తిగిల్లి
మొలకెత్తబోయే చిగురాకుతో
కదులాడే, పసినయనం వంటి
విత్తనం, రాయీ అక్కడ. 'అ. రాయి. అక్కడ'- అదే (నువ్వు)
అన్నది, నీ తలుపులు తెర
చాపిన నాడు. అందుకనిక
నావని చీల్చే నీటిని తొలగించి చూద్దును కదా, అప్పటికే
పెదాల అంచున
పుష్ప గుచ్చాన్ని
ఉంచి, తొలిగారు
ఎవరో. మరి ఇక
వొత్తి లేని ఒక దీపం
రాత్రంతా ఇక నిప్పు(/లేని/) నిశ్శబ్ధంతో మాట్లాడటం ఎలా?
No comments:
Post a Comment