25 July 2013

how we die

కుచ్చిళ్ళు పారాడుకుంటూ తిరిగే చీకటి: చాచిన అరచేతులకి
     పలకలు, పలకలుగా గాలి.
     తెరచి ఉంచు కిటికీ.లోపలికి

వచ్చేది ఏదీ ఉండదు నీతో, వెలుపలకి వెడుతూ అడగరు ఎవరూ
     నిన్ను, మరొకరితో వెడుతో.న్నీ
     చుట్టూ, రెక్కల కొట్టుకుంటున్న
     పావురాళ్ళ సవ్వడి. అవే...
   
నిశ్శబ్ధంలోంచి లేచే పావురాళ్ళు. అనువాదం కాని కళ్ళు -

ఇక, లాంతరు వెలిగించలేక, బావురుమంటూ రాలిపోయింది
     తెల్లటి కుచ్చిళ్ళ నల్లని చీకటి-ఇక
     నీలో ఒదిగొదిగి ఏడ్చే వక్షోజాలకి
     రాత్రి కుంకుమ అంటిన కన్నీటికీ

ఏమని చెప్పగలవు, ఖాళీ లేని కాగితాలయ్యిన పెదాలతో? 

1 comment:

  1. మూటా ముల్లే అందించి ఇక వెళ్తానని ధైర్యం చెప్పేంత సమయం ఉండదు,నీలో ఒదిగొదిగి ఏడ్చే వక్షొజాలకి రాత్రి కుంకుమ అంటిన కన్నీటిని మునివేళ్ళతో తుడిచేసే సమయం ఉండదు! ముందే తుడిచి అన్నింటికీ సంసిద్ధంగా ఉండాలి!

    ReplyDelete