నీ కళ్ళనూ కనుగుడ్లనూ
వాటిపై జారే
చీకటి కుబుసాలనూ
నీ నాసికనూ శ్వాసనూ
వాటిలో వెలిగే
వెదురు వనాలనూ
నీ చెంపలనూ
నీ పెదాలనూ
నాకీపూట నాలికతో
లిఖించాలని ఉంది
నీ చెవులనూ
నీ నుదురునూ
రెండింటి మధ్యా నిర్మితమైన
పొదరిల్లులలో
నీ శ్వేతచుబుకంలో
మెడలోయలయలో
తేనెటీగలు కట్టుకున్న పదాల
గూళ్ళల్లో కళ్ళల్లో
పక్షులు విహరించే
నీ వక్షోజాలలో, తల్లి పాలు రాలే
నీ హృదయంలో
నీ నాభిలో, నాభిలో నిండిన
నాదైన స్వరంలో
నీ యోనిలో నీ ప్రేమలో
మెలికలు తిరుగుతూ
కిందకు సాగిన
వెన్నెల కాళ్ళతో
నీ గర్భంలోని
కాలంతో
నాకీపూట నా నాలిక కలంతో
లిఖించాలని ఉంది
ఏమంటావు నువ్వు?
ఏం చేస్తావు నువ్వు?
((ఆ దినమంతా వర్షం పడగా
పాపం అతడు పాపంతో
రాత్రంతా దహించే శాపంతో
తాకని తన దేహంతో
ఇల్లు లేని కప్పలతో గడ్డిలో
అరుచుకుంటో
మొహంతో తాపంతో తీరని
కోరికతో సొమ్ముసిల్లాడు))
= నీకా కధ తెలుసా?=
శ్రీకాంత్ గారూ మోహం ఒక అగ్నిజ్వాల... పరమ సౌందర్యాత్మకం.. దు:ఖభూయిష్టం.. కాలిపోతుంటాం.. విడవలేం.. దానినుండి.. కొన్ని క్షణాలు విడివడి.. ఏమిటి జీవితం.. ఏమిటి జీవితానుభవం.. అని నిర్లిప్త ప్రశాంతం గా పరిశీలిస్తే.. దానిని దాటిన జీవితం.. తేజోరాశిలా వెలుగుతూ కనిపిస్తుంది.. ఇది మీ కవిత్వానికి సరైన ప్రతిస్పందన కాదేమో....
ReplyDeleteenduko naku peddaga nachhaledu...
ReplyDeleteపక్షులు విహరించే
ReplyDeleteనీ వక్షోజాలలో, తల్లి పాలు రాలే
నీ హృదయంలో
adbhutaM kadaa