20 September 2011

తంత్రీ తంత్రం

ఒక తంత్రి తంత్ర ప్రసారం 24/7 365 రోజులు

కనులు విరిగే కధనాలుగా
ఒళ్ళు సాగిన నృత్యాలుగా

ఏర్పడుతోంది ఒక స్మశానం బహు అందంగా ఆకర్షణంగా:
శవాలు ఇంత రూప సౌందర్యవతులని, ఇనుప కౌగిళ్ళతో
నాగులు నడయాడే పెదాలతో నిన్ను కట్టి పడవేస్తాయనీ

తెలిసింది ఇప్పుడే:

24/7 365 రోజులు
పగలూ రాత్రుళ్ళూ
చేతిలో రిమోట్ తో

సంసార శ్మశానానికి
స్మశాన సంసారానికీ

నువ్వే రారాజువి: వార్తల వార్తాహరుల
యంత్ర మంత్ర తంత్రమాయాజాలానికీ
నువ్వే
రచయితవు=

కుండీలలో మొక్కలు మొక్కలకి పూవులు
చదరపు గదుల్లో పట్టనంతగా వ్యాకోచించిన
రతీ రాతి శరీరాలు

=
బల్ల అంచుపై నీళ్ళతో
ఊగిసలాడుతోంది ఒక
పసివదనం గాజుకూజా

నిస్సహాయంగా నీవైపు
చూస్తో కన్నీళ్లను
రాలుస్తో: ఆపుచేస్తావా
నువ్వు క్షణకాలం

నిన్ను నములుతున్న
రంగుల ప్రతీకల
రాక్షస ముఖఅద్దాన్ని?

2 comments:

  1. చదరపు గదుల్లో పట్టనంతగా వ్యాకోచించిన
    రతీ రాతి శరీరాలు/బల్ల అంచుపై నీళ్ళతో
    ఊగిసలాడుతోంది ఒక
    పసివదనం గాజుకూజా/
    నిన్ను నములుతున్న
    రంగుల ప్రతీకల
    రాక్షస ముఖఅద్దాన్ని?...SUPERB EXPRESSIONS.. koMCeM divinuMCi digivaCCinaTTunnArE!

    ReplyDelete
  2. surreal సెగలు కక్కే కవిత్వం. బాగా రాసారు :)

    ReplyDelete