నువ్వు రాకు ఇలా, ఈ కల ఇక
అంతమయ్యింది. నిన్ను నేను
ఇక తీసుకోలేను, ఇక ఈ గాలిలో
దీపం పెట్టలేను
మరలా మరలా తిరిగి తిరిగి
రాలిపోలేను
నువ్వు రాకు ఇలా, నిదురలోకి
కలల ఎక్కిళ్లలోకి
నువ్వు అసలే రాకు అలా
నీ తెల్లటి పాదాలతో, నేను ఎపుడో
మరచిన నీ పదాలతో
ఇక ఎప్పటికీ నేను తాకలేని
నీ చేతివేళ్ళ చివర విరిసే
వెచ్చటి మిణుగురులతో
నువ్వు రాకు అలా, ఇక ఈ గాలిలో
దీపం పెట్టలేను
నీ రూపాన్ని, సంజ్ఞనీ ఇక తట్టుకోలేను=
No comments:
Post a Comment