10 January 2011

మిత్రులు

మిత్రులు వచ్చారు
మధువుతో, మధుపాత్రలతో
పాత్రలతో=

అందుకని
శీతాకాలపు ఎండ
పసుపు పచ్చటి సీతాకోకచిలుకై
వచ్చింది
మా ముఖాలని
తన రెక్కల గాలితో తాకేందుకు
మమ్మల్ని తన సమయంతో
వివశితులను చేసేందుకు


మిత్రులు వచ్చారు
వేదనతో, దీవెనలతో
వాదనలతో
ఒకింత చింతతో =

మిత్రులు వాళ్ళు
ఈ లోకంలో దారితప్పి
తిరుగాడుతున్న
దేవతలు వాళ్ళు: రాక్షసులు
వాళ్ళు

భార్యలు ఉండీ లేని వాళ్ళు
పిల్లలు ఉండీ లేని వాళ్ళు
ఇళ్ళల్లో వ్యాపించిన
వ్యాపార బంధాలను
తట్టుకోలేని వాళ్ళు : వాళ్ళు

మిత్రులు వాళ్ళు
స్త్రీలకోసం వెతుకుతున్న వాళ్ళు
పదాల కోసం
వెతుకుతున్న వాళ్ళు
మనుషుల కోసం
మిత్రులకోసం, అంతిమంగా
తమ కోసం తాము
ఇతరులై
వెదుకులాడుకుంటున్న వాళ్ళు
నా మిత్రులు వాళ్ళు

నా శత్రువులు వాళ్ళు
నేనే అయిన
నా ఇతరులు వాళ్ళు
ఇల్లూ వాకిళ్ళూ లేని వాళ్ళు
నా ప్రియ మరణం వాళ్ళు

మిత్రులు వచ్చారు
మధువుతో, మధుపాత్రలతో
పాత్రలతో
పవిత్ర పాపాలతో
పాపల కలలతో

నన్ను కౌగలించుకునేందుకు
నన్ను రాత్రిని చేసి
నాలో నిదురోయెందుకు
నాలో చంద్రోదయమై వికసించేందుకు

మిత్రులు వచ్చారు=

4 comments:

  1. మీ కవులంతా భార్యలపై, కుటుంబంపై పడి ఏడుస్తారెందుకు ఎప్పుడూ? భర్తలుండీ లేని వాళ్ళ గురించి ఎందుకో వ్రాయరూ?

    ReplyDelete
  2. ఈ కవితలో భార్యలపై కుటుంబంపై 'పడి ఏడ్చింది' ఎక్కడ?

    ReplyDelete
  3. read it again...baryala pi padi edavatam kadu...mithrulu...satruvulu...mruthyuvu...protoganist..poet..anni..veru veru kademo..okkarenemo...andharilo tanani vedukkovatam..leda tanalo andarni chudatam...anno ardhalu gocharisthunnai...

    ReplyDelete
  4. ee poem chaalaa baagundi...very nice.

    ReplyDelete