ఎదురుచూడకు
ఎదురు
ఎవ్వరూ రారు
తొందరపడకు
ఈ నిశ్శబ్దం మధ్యగా
ఎవ్వరూ రారు
ఏమీ ఆశించకు
గూడు వొదిలిన గువ్వ
ఎప్పటికీ రాదు
చూపులలోకీ
చేతులలోకీ, జారిపోయిన
దారులు, ఓదార్పులు
ఎప్పటికీ రావు
విశ్వసించకు
విశ్వాసం ఇవ్వకు
వేధించకు
ఒకప్పటి గూటిలోని
ఒంటరి ప్రమిదెను
ఇక ఇప్పటి మంటతో
వెలిగించు
ఒక మధుపాత్రలో
ఒకే ఒక్క పాత్రలో
నీ రక్తాన్ని
వొంపుకుని విశ్రమించు
మరొక్క రోజుకై
మరి ఒక రోజుకై
అలా బ్రతికి ఉండు=
No comments:
Post a Comment