28 January 2011

నా చిన్నప్పుడు

౧.
నా చిన్నప్పుడు ఆకాశం ఎర్రగా ఉండేది

చందమామ పచ్చగా
చెట్లు మేఘాలలోంచీ మొలిచేవి
వర్షం నేలలోంచీ కురిసేది

నా చిన్నప్పుడు ఆకాశం ఎర్రగా ఉండేది.
౨.
నా చిన్నప్పుడు ఆకాశంలో యీబాలు ఎగిరేవి

అవి గాలిపటాలవలె తేలుతూ
మబ్బుల చాటున దాగిన సూర్యుడిని
నోట కరుచుకుని
సాయంత్రం ఎక్కడికో వెళ్లిపోయేవి
మళ్ళా మరు సాయంత్రం
చెట్ల మీదుగా తెల్లటి రెక్కలతో, వెన్నెలతో
తిరిగి వచేవి

నా చిన్నప్పుడు ఆకాశంలో యీబాలు ఎగిరేవి

౩.

నా చిన్నప్పుడు పచ్చికలో మిడుతలు వాలుతూ
నన్ను పిలిచేవి
నన్ను తమ ఇళ్ళకు తీసుకు వెళ్ళేవి

అక్కడ నత్తలూ, నలుపు చేపపిల్లలూ గుర్రాలెక్కి
నీళ్ళలో పరుగులు పెట్టేవి
కొన్ని పిచ్చుకలు నాకు అన్నం తెచ్చి పెట్టేవి
అమ్మా అని పిలిచినప్పుడు
తొమ్మిది చందమామలు తొమ్మిది నక్షత్రాలతో
తొమ్మిది మిడుతలతో
నా వద్దకు వచ్చి బోలెడన్ని కథలు చెప్పేవి

నా చిన్నప్పుడు రాత్రిలో కలలు అలలుగా తేలుతూ
నన్ను పిలిచేవి
నన్ను తమ ఇళ్ళకు తీసుకు వెళ్ళేవి

(incomplete)

No comments:

Post a Comment