19 January 2011

మీరే

నేను ఎప్పుడూ చెప్పలేదు

ఎవరినీ వెళ్ళిపొమ్మని
ఎవరినీ రమ్మనీ=

పూలహారాలతో, ముళ్ళ
పాదాలతో

వచ్చిందీ మీరే
వెళ్లిపోమ్మందీ మీరే.

వెనుకనుంచి
అరచేతులతో కనులను
కప్పిందీ మీరే
కనులనూ పెరికివేసినదీ
మీరే.

కౌగలించుకున్నదీ మీరే
కసిరి విసిరివేసినదీ మీరే

నాలుకపై బీజాక్షరాలు
రాసినదీ మీరే
నాలుకను శిలువ
వేసినదీ మీరే

కాంతిగా మారిందీ మీరే
నీడగా, మృత్యు జాడగా
మారిందీ మీరే

పదాలలోంచి తొలుచుకు
వచ్చిందీ మీరే
నిశ్శబ్దాలలోకి, నిరీక్షణలలోకీ
నను తోసివేసిందీ మీరే

నేను ఇప్పుడూ చెబుతున్నాను

నేను ఎప్పుడూ చెప్పలేదు

ఎవరినీ రమ్మనీ
ఎవరినీ వెళ్లిపోమ్మనీ=

1 comment: