16 January 2011

త్వరగా రా ఇక

నీ చిన్నటి గుండెలో ఒక మంచుపొగ
నీ ఒళ్లంతా నిప్పుల వాన

నీ చిన్ని చిన్ని పెద్ద కళ్ళలో ఇసుక వాన
నీ చిన్ని చిన్ని పెదవులపై
వణికిపోతూ, రాలిపోతున్న ఎర్రటి పూల వాన

నీ చిన్నటి గుండెలో ఉగ్గపట్టుకున్న ఒక
మంచు పిచ్చుక బెంగ
నీ ఒళ్లంతా నిప్పుల వాన

ఆడక అలసి ఆగిపోయిన నీ నల్లటి పాదాలు
నీ నడక లేక నిశ్శబ్దమై
మిగిలిపోయిన ఈ ఇల్లు

ఎదురుచూస్తున్నాయి
నీ కోసం నల్లటి కోతులు ఎర్రటి పిర్రలతో
నీ నల్ల పిర్రల కోసం బెంగగా

ఎదురుచూస్తున్నాయి
నువ్వు లేని చెట్లల్లో, నువ్వు తాకని పూలతో:

నా పిల్ల రాక్షసుడా
త్వరగా రా ఇక, ఆడుకునే వేళైంది=

1 comment: