ఎదురుగా నువ్వుంటే
చిక్కటి చీకట్లో ఒక ప్రమిదెను
చూస్తున్నట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
మెత్తటి నిశ్శబ్దంలో,కనిపించని వారెవరో
చెవి దగ్గర పలికిన గుసగుసల్ని
వింటున్నట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
మసక సంధ్యలో, పచ్చిక బయళ్ళలో
తిరుగాడుతున్నట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
సర్వమూ మరచి, నిన్ను తలంచిన
ఒక గులాబీ పరిమళాన్ని
శ్వాసించినట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
ఎదురుగా నువ్వుండి
తేలికైన పాదాలతో, చిన్ని చిన్ని హస్తాలతో
తిరుగాడుతూ ఉంటే
మెరిసే కళ్ళతో, విరిసే పెదవులతో
పదాలను పూలుగా మార్చి
చుట్టూతా గుప్పిళ్ళతో, పలు రంగులతో
వెదజల్లుతా ఉంటే
ఎదురుగా నువ్వుంటే
చిక్కటి చీకటిలో, దీపం పెట్టుకుని
మళ్ళా ఒకసారి
తిరిగి జన్మించినట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
ఎదురుగా నువ్వుంటే
చిక్కటి చీకట్లో ఒక ప్రమిదెను
చూస్తున్నట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
మెత్తటి నిశ్శబ్దంలో,కనిపించని వారెవరో
చెవి దగ్గర పలికిన గుసగుసల్ని
వింటున్నట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
మసక సంధ్యలో, పచ్చిక బయళ్ళలో
తిరుగాడుతున్నట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
సర్వమూ మరచి, నిన్ను తలంచిన
ఒక గులాబీ పరిమళాన్ని
శ్వాసించినట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
ఎదురుగా నువ్వుండి
తేలికైన పాదాలతో, చిన్ని చిన్ని హస్తాలతో
తిరుగాడుతూ ఉంటే
మెరిసే కళ్ళతో, విరిసే పెదవులతో
పదాలను పూలుగా మార్చి
చుట్టూతా గుప్పిళ్ళతో, పలు రంగులతో
వెదజల్లుతా ఉంటే
ఎదురుగా నువ్వుంటే
చిక్కటి చీకటిలో, దీపం పెట్టుకుని
మళ్ళా ఒకసారి
తిరిగి జన్మించినట్టుగా ఉంటుంది
ఎదురుగా నువ్వుంటే
ఎదురుగా నువ్వుంటే
Nice........
ReplyDelete