నిదురలో పరాకుగా నీ చేయి నను తాకినప్పుడు
గుండెల మీద ఒక చితుకుల మంట మెత్తగా వ్యాపిస్తుంది
నిదురలో నీకు తెలియదు, అరచేయంత స్వప్నం
నా గుండెలమీద వాలిపోయి, ఆపై నా మెడ చుట్టూ అల్లుకుపోయి
ఎన్ని పురా జన్మలని గుర్తుకు తెచ్చిందో
కిటికీలోంచి దూసుకు వచ్చే పొగమంచులో, మసక వెన్నెల్లో
ఇక ఒక్కడినే నేను రాత్రంతా
నిదురలో నను యధాలాపంగా తాకిన చేతిని మృదువుగా స్పర్శిస్తూ
ఆ నును చేతి వెళ్ళనీ, వేళ్ళ అంచున
వొళ్ళు విరుచుకుని విచ్చుకుంటున్న నిప్పుపూల వాననీ శ్వాసిస్తూ
ఒక్కడినే రాత్రంతా, ఒక్కడినే పగలంతా
good one
ReplyDelete