01 January 2011

ఆ రాత్రికి

ఒక పాత్ర బ్రాందీ
ఒక పాత్ర ప్రకాశవంతమైన కాంతి (లేదా)
ఒక పాత్ర నిండా
పరిశుభ్రమైన తెల్లటి నారింజ కాంతి
చాలు ఈ పూటకి
చెట్లపై చిలుకరించేందుకు
చాలు ఈ పూటకి
పిట్టలతో చిగురించేందుకు=

సిగిరెట్స్?
అవును
ఉన్నాయి అవి, కొన్నిసార్లు
ఉండవు అవి=
ఒక పాత్ర నిండా
సరిపడినంత మత్తు?
అవును
ఈ ప్రాణానికి
ఈ కలలకీ సరిపడినంత
ఉంది అది
ఉంటూనే ఉంటుంది అది
ఆది నుంచి
అనంతం దాకా=

ఈ లోగా
మృత్యు విహంగాన్ని
సుదూరంగా
విహరిస్తున్న
మృత్యు విహంగాన్ని
నేను
ఈ రాత్రికి
మరణిస్తున్నానో లేదో
అడగాలి
ఒక పాత్ర బ్రాంది
ఒక పాత్ర తెల్లటి కాంతి
చెట్లకు పైగా
రాలుతున్న నారింజ కాంతీ
పొగలో
తమలో
ఒక్కరిగా మారిన
ముగ్గురూ
ఈ పూటకు
మరణిస్తున్నారో లేదో
కనుక్కోవాలి

మృత్యు విహంగమా
మృత్యు విహంగమా
నన్ను
ఈ రాత్రికి తాకదలుచుకున్నవా?
మృత్యు విహంగమా
మృత్యు విహంగమా
సుదూర తీరాలలో
ఎగురుతున్న
మృత్యు విహంగమా
నన్ను నీ
రెక్కలతో పాటు
ఈ రాత్రికి తీసుకు వెళ్ళదలుచుకున్నావా?
*


* Bird of Prey by Doors from American Prayer

ఆ పాట సాహిత్యం ఇది:

Bird of Prey
Bird of Prey
Flying high
Flying high
In the summer sky
Bird of Prey
Bird of Prey
Flying high
Flying high
gently pass on by
Bird of Prey
Bird of Prey
Flying high
Flying high
am i going to die
Bird of Prey
Bird of Prey
Flying high
Flying high
take me on your flight

1 comment: