14 January 2011

నల్ల పిర్రల వాడు

నల్ల పిర్రల వాడు
కలువ కన్నుల
వాడు
చిగురాకుల చేతివేళ్ళ
వాడు

వాడు నా వాడు

చామన ఛాయ వాడు
కోపమొస్తే
ఎర్రగా కంది వణికిపోయే
వాడు
నవ్వితే
వెన్నెలవోలె విరగాబూసే
వాడు

వాడు నా వాడు

ఎత్తు పళ్ళ వాడు
చిన్ని పెదవుల వాడు
తనకు తాను
పేరు పెట్టుకున్న వాడు
నల్ల పిల్ల కోతి వాడు
ఒడిలో ముడుచుకుపోయే
కుక్కపిల్ల వాడు


చిట్టి ఆటల వాడు
పొట్టి కథల వాడు
ఆమె మెడలో పూలహారమై
పరిమళించే
వాడు

వాడు నా వాడు

విరిగిన బొమ్మలతో వాడు
పగిలిన పలకతో వాడు
పదాలతో వాడు
పాద పద్మాలతో వాడు

వాడు నా వాడు

పిచ్చుకలతో
వాడు
గోడపై నీడలతో
వాడు
వేప చెట్టు కింద వెన్నెలలో
వాడు
వెన్నెలతో
వాడు
వెన్నెలే వాడు

వాడు నా వాడు

నీళ్ళని పూవులుగా
మారుస్తూ
వాడు
పూవులని వర్షంగా
మారుస్తూ
వాడు
వర్షమే వాడై
ఇల్లంతా కురిసే
వాడు
ఆమె కన్నుల్లో
లేత ఎండై మెరిసే
వాడు

వాడు నా వాడు

పచ్చి గడ్డిలో కుందేలు
వాడు
పచ్చిక మైదానాలలో
పరుగాడే జింక
వాడు
ఆగకుండా రాలిపడే జలపాతం
వాడు
మాటల పోగు
వాడు

వాడు నా వాడు
నా నల్ల పిర్రల వాడు


(to the little devil)

10 comments:

  1. అద్భుతమైనవాడు కదా వాడు

    ReplyDelete
  2. wow.. I have one with a cute black butt too.. :)

    ReplyDelete
  3. నల్ల పిల్ల కోతి వాడు
    ఒడిలో ముడుచుకుపోయే
    కుక్కపిల్ల వాడు

    చిట్టి ఆటల వాడు
    పొట్టి కథల వాడు
    ఆమె మెడలో పూలహారమై
    పరిమళించే
    వాడు

    బాగా పట్టుకున్నారు అనుభూతిని. పిల్లల మీద వచ్చిన అతి కొద్ది కవితలలో చాలా మంచి కవిత ఇది. ధన్యవాదాలు.

    ReplyDelete
  4. నల్లపిర్రలవాడు చాయలో మిన్నల్( యు కె జి) చెప్పిన కవిత
    ఖుషీ టీవీ చూసేవాడు
    హోం వర్క్ పొద్దున్నే రాసేవాడు

    రాత్రంతా నిద్దర పోకుండా
    కథలు చెప్పమని సతాయించేవాడు

    పొద్దున్నే లేచీ బ్రష్ చేసేవాడు
    స్లేట్ వర్క్ రాసుకునేవాడు

    స్నానం చేసేవాడు
    ఇడ్లీనో దోసెనో ఏదోఒకటి తినేవాడు

    దువ్వెనతో తల దువ్వుకునేవాడు
    బ్యాగుతీసుకొని స్కూలుకెళ్ళేవాడు

    స్కూల్ కెళ్ళేటప్పుడు
    బ్యాగును ఎవరితో ఒకరితో మోయించేవాడు

    చిన్నగా పొట్టిగా ఉండేవాడు
    వాడే ప్రణీత్

    ReplyDelete
  5. స్క్రీన్ షాట్లు తీసేవాడు
    వదినా మరుదుల కథలు వ్రాసేవాడు

    రాత్రంతా నిద్దర పోకుండా
    కామెంట్లు పెట్టేవాడు

    పొద్దున్న లేవగానే
    బ్లాగులు చదివేవాడు

    గ్రహణం టైములో
    పాచిమొహంతో బిర్యానీ తినేవాడు

    మత్గి పూర్తిగా చెడినవాడు
    వాడే ప్ర... :))

    ReplyDelete
  6. సగం మతి చెడిన వాడు
    రీమిక్స్లతో అదరకొట్టేవాడు

    దార్కారి వాడు
    వింత వైరస్ వాడు

    బ్లాగులన్నీ లాగులతో
    తిరిగే వాడు
    ఇతరుల లాగులని
    పీకే వాడు

    అవును వాడే
    మలక్పేట్ రౌడిగా... ::-)

    ReplyDelete
  7. హి హి హి హి హి హి హి :)

    ReplyDelete
  8. for your devil, follow naakai - 10
    thanking you, sir

    ReplyDelete