నా గొంతు మీద
నీ వెన్నెల కత్తి
మరి నీ నోట నా మాట రాదే
మంచు మ్రోగే మౌనం నీది
తడిచి వీగిపోయే
చిరు గానం నాది
నేరాలు గురించి ఎందుకు
చెరో కారాగారమే యిక్కడ
గదిలో నీడలు. నీడలలో
పొసగిన నెత్తురు పూలు
పూలల్లో, ఎగిరిపోయే
పక్షుల రెక్కల శబ్ధం
శరీరమంతా కలకలం.
చూడు, వెలుగుతోంది
నువ్వు వెలిగించిన
ఒక ప్రమిదె
నా తల వద్ద.
నీ వెన్నెల కత్తి
మరి నీ నోట నా మాట రాదే
మంచు మ్రోగే మౌనం నీది
తడిచి వీగిపోయే
చిరు గానం నాది
నేరాలు గురించి ఎందుకు
చెరో కారాగారమే యిక్కడ
గదిలో నీడలు. నీడలలో
పొసగిన నెత్తురు పూలు
పూలల్లో, ఎగిరిపోయే
పక్షుల రెక్కల శబ్ధం
శరీరమంతా కలకలం.
చూడు, వెలుగుతోంది
నువ్వు వెలిగించిన
ఒక ప్రమిదె
నా తల వద్ద.
No comments:
Post a Comment