రాత్రైతే
వొద్దు వొద్దు అనుకుంటూనే అడుగు పెడతావు
వెదురు వనాలలోకీ: మసక వెన్నెల పరుచుకున్న
ఆ మట్టి దారులలోకీ మంచు దీపం వెలిగే వేళల్లోకీ
రాత్రైతే
వొద్దు వొద్దు అనుకుంటూనే ఆగిపోతావు.
నక్షత్రాలు నిండిన పూల ఆకాశంలోకీ, నిదుర వాసనలోకీ
చెమ్మగిల్లిన భూమిలోకీ ఆ శాంతి నిశ్శబ్ధంలోకీ.
రాత్రైతే
ఒక మెలుకువలోకి మేల్కొని, ముఖాన్ని కడుక్కుని
శరీరాన్ని విడిచి ఒక ప్రయాణం మొదలు పెడతావు
ఒక కాంతి లోకంలోకి, నీడల వెలుగులోకీ-
అంతిమంగా నీలోకీ.
రాత్రైతే మరి నేను ఎక్కడ ఉంటాను?

bagundi
ReplyDeleteentha baaga raastunnavo...nakashtraalu nindina poola aakaasamloki,nidura vaasanaloki...bhesh,chaala chaala baagundi ...mydear
ReplyDeletevenkatrao
baavundi
ReplyDelete