చల్లని చీకట్లో, ఈ అశోకా వృక్షాలపై మెరుస్తాయి కాంతి చుక్కలు
నారింజ రంగు వెలుతురులో: పైనేమో ఒక వెన్నెల తుఫాను
పచ్చికలో కూర్చున్న యువ జంటలో
నువ్వేమైనా ఉన్నావేమో, తిరుగుతూ
తిరుగుతూ నీవైపు వచ్చి నిన్ను తాకే
ఆ పసి నవ్వూ ఆ పసి స్పర్శా
ఇక అవే నువ్వు ఈ పూటకి చేసుకున్న అదృష్టం. తాకిన వాళ్ళని
వొదలలేక అలా నిలబడిపొతావు నిశ్చలమైన ఉద్యానవనంలో
చల్లటి చీకటిలో, ఆ అశోకా వృక్షాలతో వొంటరిగా మిగిలిపోయిన
యువకుడితో, అతని చేతుల మధ్య ఆరిపోయిన తన స్పర్సతో:
దిగులు చెందకు. చివారఖరికి మిగిలే ఉంది నీతో
నీ తడపడే అడుగులకు తోడుగా
మంచుకి తడిచిన ఒక చిన్న కప్ప.

No comments:
Post a Comment