నీ పాదాలు నడయాడిన చోట తిరుగుతాను
నీ శరీరపు సువాసన ఏదైనా దొరుకుతుందేమోనని
నువ్వు సర్దిన గదులన్నీ వెదుకుతాను
నీ చేతులు తాకిన వస్తువులను మెత్తగా ముట్టుకుంటాను
నీ స్పర్శ ఏమైనా నా వేళ్ళ అంచులకు తాకుతుందేమోనని
నువ్వు నీళ్ళు చిలుకరించిన కుండీల వద్ద కూర్చుంటాను
వికసించిన పూలలో నీ మోము
ఏమైనా కనపడుతుందేమోనని
నువ్వు వండి పెట్టిన అన్నం పాత్ర వద్ద తచ్చాట్లాడతాను
మెతుకులు అంటిన నా పెదాలకు నీ పెదాలు
ఏమైనా అంటుకుంటాయేమోనని.
నువ్వు వేసిన పక్క వద్దా, దిండు వద్దా కూర్చుంటాను
నీ శిరోజాలు ఏమైనా గాలిలా వీస్తాయేమోనని
కిటికీ తలుపులు కొంత తెరిచే ఉంచుతాను. నువ్వు
చూసే నక్షత్రాలు చినుకులై ఇక్కడ రాలతాయేమోనని
గడ్డి పరకలు వీచే రాత్రి గూటిలోకి చూస్తాను
నీ కళ్ళ వంటి పావురాళ్ళు తిరిగి వచ్చాయో లేదో అని
కొంత నవ్వుకుంటాను, కొంత నొచ్చుకుంటాను
పూల వంటి రాళ్ళ వంటి నీ మాటలు గుర్తుకువచ్చి
కొంత దిగులు పడతాను కొంత కంగారుపడతాను
నువ్వు లేక రేపు ఎలా బ్రతకాలో తెలియక బెంగే పడతాను
అస్థిమితం అవుతాను అస్థవ్యస్థం అవుతాను. చూడు
నువ్వు లేక ఒక ప్రాణి ఎలా గిల గిలా కొట్టుకుంటుందో.

No comments:
Post a Comment