ఏదో పోగొట్టుకునే వచ్చాను, ఈ జీవితంలోకి:
వెదికీ వెదికీ, చివరికిలా
నీ ముంగిట్లో ఈ చీకట్లో
కాళ్ళు తడుపుకుంటూ కూర్చున్నాను
నీడల వలయాలలో, ఖాళీ అరచేతులతో
ఖాళీ హృదయంతో కనిపించని కనులతో
ఒక కబోధి శ్వేత పుష్ప స్వప్నాన్ని
మంచు వెన్నెల్లో, పొగమంచులో కలగంటూ:
పురాజన్మల స్మృతి ముద్రికను
నుదిటిపై శిక్షా స్మృతిలా ముద్రించుకుని
హృదయాన్ని ఒక బిక్షపాత్రగా మార్చుకుని
లోకమంతా ఏకాకిగా తిరిగేవాడిని
ఏమని పిలుస్తావు నువ్వు?
వెదికీ వెదికీ, చివరికిలా
నీ ముంగిట్లో ఈ చీకట్లో
కాళ్ళు తడుపుకుంటూ కూర్చున్నాను
నీడల వలయాలలో, ఖాళీ అరచేతులతో
ఖాళీ హృదయంతో కనిపించని కనులతో
ఒక కబోధి శ్వేత పుష్ప స్వప్నాన్ని
మంచు వెన్నెల్లో, పొగమంచులో కలగంటూ:
పురాజన్మల స్మృతి ముద్రికను
నుదిటిపై శిక్షా స్మృతిలా ముద్రించుకుని
హృదయాన్ని ఒక బిక్షపాత్రగా మార్చుకుని
లోకమంతా ఏకాకిగా తిరిగేవాడిని
ఏమని పిలుస్తావు నువ్వు?
baavundi...entaki emani pilavali..??
ReplyDelete