కూర్చున్నాం ఇద్దరం, ఎదురెదురుగా ఖాళీగా
ఉదయపు ఎండలో గాలికి కొద్దిగా కదిలే
తోటలోంచి తెంపుకు వచ్చి పూలపాత్రలో ఉంచిన
రెండు తెల్లని గులాబీ పూవుల్లా:
తనకీ నాకూ తెలియనిదల్లా మమ్మల్ని
ఎవరు తెంపుకు వచ్చారన్నదే: అందుకే
కూర్చున్నాం అక్కడే ఇద్దరం
సాయంత్రం వడలిపోయి రాత్రిలోకి
రాలిపోయేదాకా!
చూడూ
ఇక రాత్రంతా ఒక్కటే మంచులో
పూలు లేని కుండీలలో ఒంటరిగా ఒక చందమామ
ఎలా కూర్చుండి పోయిందో.
No comments:
Post a Comment