నిప్పులతో అల్లిన పూలు ఇష్టం నీకు
వెన్నెలైనా మరిగిన దీపమై వెలగాలి
ఏదో ఒక చెట్టు కావాలి. ఏదో ఒక నీడ
నీ చుట్టూతా తిరగాలి. గాలిలో
ముఖాన్నీ వానలో శరీరాన్నీ
అద్దుకుని తుడుచుకోవాలి.
ఆపై నీ నుదుటిన ఒక ఎర్రని
తారకని దిద్దుకోవాలి. చూడు
అరచేతిలో ఒక తేనీరు పాత్రతో
కనుల నిండుగా ప్రశాంతతతో
ఉదయపు కాంతిలో
కూర్చున్నావు కానీ
తిలకాన్ని అద్దుకున్న నీ
బొటన వేలిని చూసుకో ఒక్కసారి
ఎవరిదో నిండైన శరీరం
చిటికెడంత నెత్తురై నీ వేళ్ళ మధ్య చితికి
మాటలు లేని ఒక నల్లని రాత్రై నిలిచి ఉంటుంది.
వెన్నెలైనా మరిగిన దీపమై వెలగాలి
ఏదో ఒక చెట్టు కావాలి. ఏదో ఒక నీడ
నీ చుట్టూతా తిరగాలి. గాలిలో
ముఖాన్నీ వానలో శరీరాన్నీ
అద్దుకుని తుడుచుకోవాలి.
ఆపై నీ నుదుటిన ఒక ఎర్రని
తారకని దిద్దుకోవాలి. చూడు
అరచేతిలో ఒక తేనీరు పాత్రతో
కనుల నిండుగా ప్రశాంతతతో
ఉదయపు కాంతిలో
కూర్చున్నావు కానీ
తిలకాన్ని అద్దుకున్న నీ
బొటన వేలిని చూసుకో ఒక్కసారి
ఎవరిదో నిండైన శరీరం
చిటికెడంత నెత్తురై నీ వేళ్ళ మధ్య చితికి
మాటలు లేని ఒక నల్లని రాత్రై నిలిచి ఉంటుంది.
Good one.
ReplyDelete