బిందువునై కూర్చున్నాను ఒక వృత్తంలో.
ఎవరిదో శ్వాస నా ఆత్మ చుట్టూ. ఇదే దారో
తెలియటం లేదు. నీ శరీరంలో ముఖం
కడుక్కుందామనే ఒక కోరిక. తెలుసు
చివరికి కన్నీళ్ళతో కడుక్కుంటానని-
తెలియటం లేదు. నీ శరీరంలో ముఖం
కడుక్కుందామనే ఒక కోరిక. తెలుసు
చివరికి కన్నీళ్ళతో కడుక్కుంటానని-
పూలను తాకిన చేయీ, నిన్ను తాకిన కనులూ
తిరిగి రావు. శిఖరాగ్రహపు అంచున మెరిసే
సీతాకోకచిలుకలూ రాత్రి ఆకాశంలో తడిచిన
నక్షత్రాలూ అద్దంపై వాలిన చినుకులూ
నా చుట్టూనూ.
రెపరెపలాడే నిశ్శబ్ధాన్ని నిశ్శబ్ధంగా మార్చి
మడిచి, ఒక దీపం వెలిగించుకుని, దానిని
తలగడలా అమర్చుకుని నిదురించే విద్య
ఏదీ లేదు నా వద్ద.
అందుకే చెబుతున్నాను.
అందుకే చెబుతున్నాను.
చూడు. ఇటువైపు. నీ వృత్తంలోని
ఈ బిందువు వైపు.
ఈ బిందువు వైపు.
చెదిరిపోయింది గూడు.
No comments:
Post a Comment