17 December 2011

ఎలా!

ఎలా గడిచింది నిన్నటి దినం!

ఎదురుచూసాను ఎదురు మాత్రం చూసాను

పూసిన పూలను చూడలేదు
రాలిన చినుకులను తాకలేదు
నిలువెల్లా ముంచిన గాలిని ఆహ్వానించనూ లేదు

అరచేతుల్లో ముఖం
శరీరమంతా దుక్కం

నీడల్ని మునివేళ్ళతో తాకుతూ
ఎలా గడిపాను నిన్నంతా
నువ్వులేని నిన్నటి దినం!

ఎదురుచూసాను ఎదురు మాత్రమే చూసాను

బహుశా ఇక్కడకు నీ వద్దకు రావడమే
నేను చేసిన ఒక పవిత్రమైన తప్పు: ఇక

ఈ శిక్ష సరైనదే. నిన్ను అడిగేవారెవ్వరు?

1 comment:

  1. "పూసిన పూలను చూడలేదు
    రాలిన చినుకులను తాకలేదు
    నిలువెల్లా ముంచిన గాలిని ఆహ్వానించనూ లేదు"

    Loved the feel in this part.

    ReplyDelete