ఈ నగరం తాకని, ఏ వెన్నెల వానో కురిసే రాత్రిలో తడిచే పూలను
సున్నితంగా పరికించినట్టు, నీ చేతివేళ్ళని
తాకాలని అనుకుంటాను -
అవే
నిద్దురలో ఒక పక్కకి ఒత్తిగిల్లి, నాకు తెలియని భాషలో కలవరించే నీ చేతివేళ్ళు -
అద్దంపై పొగమంచుని తుడిచి ముఖాన్ని చూసుకున్నట్టు
అప్పుడొక
గగుర్పాటు. ఉదయమంతా పొగచూరి, మసిబారి, ఇప్పుడిక ముడుతలు పడి
వెక్కి వెక్కి ఏడ్చి నిదురలోకి జారిన, పసిపాపల వంటి నీ
చేతివేళ్ళు -
చీపుర్లు అయిన చేతివేళ్లు. వంట గిన్నెలయ్యిన చేతివేళ్ళు. దుస్తులయ్యిన చేతివేళ్లు.
సబ్బూ, రుబ్బురోలు పత్రమూ, గదులూ మలమూ మూత్రమూ ఏర్పరిచిన
పసుపుపచ్చ
మరకలనూ
శుభ్రం చేసే
శ్రమా అయిన చేతివేళ్ళు. నువ్వు కక్కుకున్నప్పుడు మట్టికుండై నిన్ను నింపుకున్న
చేతివేళ్లు. అన్నం పెట్టే చేతివేళ్లు. నీకు నీళ్ళు తాపించే చేతివేళ్లు.
అప్పుడప్పుడూ
తలుపు చాటున
కండ్లల్లో నీళ్ళు కుక్కుకునే చేతివేళ్లు. అప్పుడప్పుడూ మూగవోయె చేతివేళ్లు. నుదురుని
అరచేతిలోకి వంపుకుని రాత్రంతా కూర్చునే చేతివేళ్లు.
నిన్ను శపించలేని చేతివేళ్లు.
నిన్ను దీవించే చేతివేళ్లు -
నిన్ను ప్రేమించీ, ప్రేమించీ, గరకుగా మారి, ఇప్పుడిక ఒక కలత నిద్రలో
పెరడులో ఆరవేసిన దుస్తులు రెపరెపా కొట్టుకుని, ఒక ముళ్ళతీగకు చుట్టుకుని
ఆగిపోయినట్టున్న, నీ చేతివేళ్లు-
తిరిగి గాలికి కదిలి
తను కొద్దికొద్దిగా చిరుగుతూ, ముల్లుతో ఉండా లేకా, పూర్తిగా వొదిలి వెళ్లిపోలేకా
మరింతగా చీలిపోయే నీ చేతివేళ్లు.
చీకట్లో దీపాన్ని వెలిగించే చేతివేళ్లు.
అదే దీపాన్ని ఆర్పుతూ మరెవరివో చేతివేళ్లు. ఇక మరి ఎక్కడిదో ఒక గాలి ఇక్కడ
వీచీ వీచీ, ఇక వీయలేక వెళ్ళిపోతే
కాలం స్థంబించిన ఆ క్షణాన
ఈ నగరం తాకిన, ఏ వానా కురియని రాత్రిలో సొమ్ముసిల్లిన నీవంటి, అమ్మవంటి
నీ చేతివేళ్ళని తాకాలని అనుకుంటాను. తాకుతాను.
ఇంత ఎరుకతో
నిన్ను తాకాక
తాకడమంటే, తాను ఇతరమవ్వడం అని తెలిసాక, తాకడమే శోక నివారణ అని తెలిసాక
ఇక మునుపటిలా, నేను, నేనులా
ఎలా ఉండగలను?

nice....
ReplyDelete