ఈ చీకట్లో, ఈ గాలిలో, ఈవేళ ఎందుకో
చెట్ల కింద నాకై ఎదురుచూస్తూ, కురులను వెనక్కి తోసుకునే నువ్వూ
నీ ముఖమూ, నీ చేతివేళ్ళ కదలికలూ జ్ఞాపకం వచ్చాయి-
ఆపై వెనువెంటనే, వెల్లువలా కమ్మివేసే, నన్ను నిలువెల్లా
దహించివేసే, దాహార్తిని చేసే, త్రికాలాలను ఏకం చేసే
దవనం వాసన వేసే నీ శరీరమూ, నీ గొంతూ, కనకాంబరం పూలూ జ్ఞాపకం వచ్చాయి-
ఆపై, ఒకప్పుడు నన్ను కావలించుకున్న నీ రెండు చేతులూ
నన్ను నిర్ధయగా వేటాడాయి. ఇకా తరువాత నీ రెండు కళ్ళూ
నా శిరస్సుపై ఉన్న ఒకే ఒక గూటిని కూల్చివేసాయి-
ఈ చీకట్లలో, ఈ గాలిలో, ఈ నక్షత్రాలలో, ఈ రాత్రి శబ్దాలలో, ఊగే నీడల్లో
కనుచూపుమేరా అనంతంగా సాగిన
డస్సిపోయిన ఈ ఒంటరి రహదారిలో
ఈ వేళ ఎందుకో
నువ్వే గుర్తుకువచ్చావు.
నేనే ఎక్కడో, తప్పిపోయాను-

పద్యం చాల బాగుంది శ్రీకాంత్! చివరి చరణాలతో ప్రాణం పోసుకున్న పద్యం.
ReplyDelete