రావి ఆకులు గలగలా కదిలినప్పుడు, అలలు ఒడ్డుకు నింపాదిగా
కొట్టుకుని వస్తున్నప్పుడు, సాయంత్రంలో
ఆ నారింజరంగు కాంతిలో, చల్లటి గాలిలో
నువ్వొక్కడివే తల దించుకుని నడుస్తూ వస్తున్నప్పుడు
తటాలున నీకొక ముఖం జ్ఞాపకం వస్తుంది -
ఎవరితోనైతే ఉందామని అనుకున్నావో, ఎవరితోనైతే కలిసి
నవ్వుదామనీ, నడుద్దామనీ, మంచు కురిసే
రాత్రుళ్ళలో, గాట్టిగా కావలించుకుని పడుకుందామనీ
కరడు కట్టిన కాలంలో కలిసి రోదిద్దామనీ
కొంత జీవిద్దామనీ, మరి కొంత మరణిద్దామని అనుకున్నావో
ఆ ముఖం! అవును అదే ముఖం.
నువ్వే వదిలివేసావో, తనే నిన్ను
మరచిపోయిందో కానీ, ఇప్పుడు
రావి ఆకులు చిక్కటి రాత్రిలోకి మునగదీసుకుంటున్నప్పుడు, చీకటి
ఒక వ్యాఘ్రమై నువ్వు వచ్చే దారిలో
పొంచి చూస్తూ ఉన్నప్పుడు, ఒకప్పుడు
నీ చేతిలో ఒక లాంతరూ, ఒక ఖడ్గమూ, శాంతి ముద్రా అయ్యి
నిన్ను పూల సువాసనతో, అతి సునాయాసంగా
తేలికగా, ప్రమాదభరితమైన ఈ దారిని దాటించి
మరో దారిలోకీ, మరో లోకంలోకి, రోజా పూల వంటి చినుకులలోకి
నీ కాలాన్ని అలలపై కాగితం పడవ చేసి
వొదిలివేసిన ఆ ముఖం, అవును అదే -
ఆ ముఖం ... ఆ ఒకే ఒక్క ముఖం ...
లాంతరు వంటి ముఖం, కాంతి వలయం వంటి, వెలుగు వాసన వంటి ముఖం
తెప్పవంటి ముఖం, వాన వంటి ముఖం
గాలి వంటి ముఖం, ఊపిరి వంటి ముఖం
శిశువుకు తల్లి పాల వంటి, ఒడి వంటి
జోలపాట వంటి తన ముఖం, ఇప్పుడు ఎక్కడ?

ఇలాంటి రాతల కోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. మొత్తానికి దొరికింది. చదువుతూ ఉంటే, అలోచనలు ఎక్కడికొ వెళ్ళిపోతాయి. జీవితాన్ని రాస్తారు మీరు. ఊహని రాస్తే ఎలా ఉంటుందో చదవాలని ఉంది. మరి ఒకటి రాసి పోస్ట్ చేయండి త్వరగా.
ReplyDelete--విజయ