తళతళలాడింది నీ గది: ఆనాడు. అప్పుడు, ఇంకా మబ్బు పట్టక మునుపు -
నీకు నచ్చిన
అగరొత్తులను వెలిగించి నువ్వు కూర్చుని ఉంటే, నీ చుట్టూతా
నిన్ను చుట్టుకునే
సన్నటి, పొగల లతలు:
అవి, నా చేతివేళ్ళు అయితే బావుండునని ఊహించాను నేను, ఆనాడు:
అప్పుడు
చిరుగాలికి, చిన్నగా కదిలాయి
కర్టెన్లూ, నేలపై నువ్వు చదివి ఉంచిన దినపత్రికలూ, నువ్వు రాసుకున్న
కాగితాలూ
పచ్చిక వలే
నీ ముఖం చుట్టూ ఒదిగిన నీ శిరోజాలూ, చివరిగా నేనూనూ. "కొమ్మల్లోంచి
ఒక గూడు రాలిపోయింది
సరిగ్గా
ఇటువంటి
వానాకాలపు మసక దినాన్నే. చితికిపోయాయి గుడ్లు - వాటి చుట్టూ
గిరికీలు కొట్టీ కొట్టీ
అలసిపోయాయి
రెక్కలు. తెలుసా నీకు?
అమ్మ ఏడ్చింది ఆ రోజే " అని చెప్పాను నేను. "నాకు తెలుసు" అని అన్నావు
తిరిగి పొందికగా నీ గదిని
సర్దుకుంటూ నువ్వు:
నేలపై పరచిన తివాచీ, తిరిగిన ప్రదేశాల జ్ఞాపకార్ధం కొనుక్కు వచ్చిన బొమ్మలూ
పింగాణీ పాత్రలూ
ఓ వెదురు వేణువూ
ఇంకా సముద్రపు తీరం నుంచి నువ్వు ఏరుకొచ్చుకుని దాచుకున్న శంఖమూనూ.
ఇక నేనూ పొందికగా
ఆ వస్తువుల మధ్య
సర్ధబడీ, అమర్చబడీ, బొమ్మగా మార్చబడీ నువ్వు ముచ్చటగా చూసుకుంటున్నప్పుడు
ఎక్కడో అలలు
తెగిపడే వాసన -
తీరాలలో అవిసె చెట్ల హోరు. ఒడ్డున కట్టివేయబడిన పడవలు అలజడిగా కొట్టుకులాడే
తీరు. కళ్ళల్లో కొంత
ఇసుకా, ఉప్పనీరూ-
మరి, తళతళలాడి
ఆనక మబ్బుపట్టి, ఈదురు గాలికి ఆకులూ, పూవులూ, ధూళీ రాలడం మొదలయ్యిన
ఆనాటి నీ గదిలో
ఇక ఇప్పటికీ ఒక వాన కురుస్తూనే ఉందా?

భావం బాగుంది, అద్వతీఅయ్మైన ఫీల్.
ReplyDelete