'అప్పుడేం మిగలవు ఇవన్నీ
గాలులు వీచే సాయంత్రాలూ, సాయంత్రాలలో వీచే స్త్రీలో పూలో, మరి
పూలల్లో, పిల్లల్లో వానల్లో వాగుల్లో, అలలుగా
తెరలు తెరలుగా పోర్లిపోయే వెన్నెల రాత్రుళ్ళో
అప్పుడేం మిగలవు ఇవన్నీ.
నువ్వేం కప్పుకున్నా, విప్పుకున్నా
నువ్వెన్ని జలతారు దుస్తులు వేసుకున్నా, ప్రదర్శించినా, ప్రవచించినా
అంతా ఇప్పుడే మరి
అంతా ఇక్కడే మరి-
అంతా ఇక్కడే మరి-
నిజం చెబుతున్నాను నేను
అప్పుడేమీ మిగలవు ఇవన్నీ. ఇక్కడ లేని మరో లోకం లేదు' అని నేను అంటున్నానంటే
నువ్వు నన్నునమ్ము మరి-
ఎందుకంటే, అప్పుడు
ఎప్పటిలా, ఒక మధ్యాహ్నం
కొమ్మల్లో ఒక కాకి రికామిగా అరుస్తూ ఉంటుంది.
నువ్వు ఎప్పుడూ కూర్చునే
ఆ కుర్చీ ఒక్కటే , చెట్ల కింది నీడల్లో
ఆ కుర్చీ ఒక్కటే , చెట్ల కింది నీడల్లో
ఖా
ళీ
గా
.
.
.
అంతే.
ళీ
గా
.
.
.
అంతే.
No comments:
Post a Comment