రాత్రి అంటే ఎందుకంత ఇష్టం నీకు అని నువ్వు అడుగుతావు కానీ
ఈ చల్లటి చీకటి నాకు ఒక పొదుగు అనీ
నేనొక దూడననీ
నీకు ఎలా చెప్పేది?
కాలిన ముఖంపై ఈ రాత్రొక చల్లటి గాలి అనీ
దప్పిక గొన్న గొంతులో ఈ చీకటి
దయగా రాలే వెన్నెల చినుకులనీ
ఇది: ఈ రాత్రీ, ఈ చీకటి నాకొక తల్లి ఒడి అనీ నేను నీకు ఎలా చెప్పేది?
'నేనంటే నీకెందుకంత ఇష్టం?' అని కూడా
నువ్వు అడుగుతావు కానీ, అప్పటికే
పగలంతా తల్లడిల్లి వీధులలో తిరిగిన
ఒక నల్లటి బుజ్జి కుక్కపిల్ల, అప్పటికే
అరమోడ్పు కనులతో
తల్లి పొదుగున చేరింది
ఆకలి కొద్దిగా ఆరిన తన శరీరంపై లేత సరస్సులను పరిచే ఆ తల్లి
నాలిక కింద ఆదమరచి నిద్రించింది.
ఇక నీకు జవాబు చెప్పడం ఎలా?
ఈ చల్లటి చీకటి నాకు ఒక పొదుగు అనీ
నేనొక దూడననీ
నీకు ఎలా చెప్పేది?
కాలిన ముఖంపై ఈ రాత్రొక చల్లటి గాలి అనీ
దప్పిక గొన్న గొంతులో ఈ చీకటి
దయగా రాలే వెన్నెల చినుకులనీ
ఇది: ఈ రాత్రీ, ఈ చీకటి నాకొక తల్లి ఒడి అనీ నేను నీకు ఎలా చెప్పేది?
'నేనంటే నీకెందుకంత ఇష్టం?' అని కూడా
నువ్వు అడుగుతావు కానీ, అప్పటికే
పగలంతా తల్లడిల్లి వీధులలో తిరిగిన
ఒక నల్లటి బుజ్జి కుక్కపిల్ల, అప్పటికే
అరమోడ్పు కనులతో
తల్లి పొదుగున చేరింది
ఆకలి కొద్దిగా ఆరిన తన శరీరంపై లేత సరస్సులను పరిచే ఆ తల్లి
నాలిక కింద ఆదమరచి నిద్రించింది.
ఇక నీకు జవాబు చెప్పడం ఎలా?
No comments:
Post a Comment