చెట్లని పట్టుకుని, మసక చీకట్లో ఊగుతాయి ఈ వాన చినుకులు ఆకుల్ని వదలకుండా
అప్పుడొకటీ అప్పుడొకటీ ఆకస్మికంగా నీ మెడపై రాలి
నీ శరీరాన్ని ఒక గగుర్పాటుకి గురి చేస్తో: ఇక నువ్వు
చక్కగా నీ చేతులు చుట్టూ చుట్టుకుని, కొంచెం వెచ్చగా మరి కొంత ఇష్టంగా మారతావు
ఉదయం నుంచీ గుండెను తవ్వుతున్న ఒక ఎర్రటి జ్ఞాపకం
నుంచి తప్పించుకుని: ఇక అప్పుడు మరి ఎందుకో నీకు
గుర్తుకు వస్తాయి పూవులూ. గుర్తుకు వస్తారు పిల్లలూనూ. గుర్తుకు వస్తారు
వెన్నెల శాలువాలని కప్పుకుని, చుక్కల జూకాలతో కొంత దిగులుతో
చీకటిలో, రాజప్రసాదాల్లో తిరిగే అన్యమనస్కులైన ఆ స్త్రీలూ
ఒకప్పుడు నీ గదిలో వాళ్ళు వెలిగించిన అగరొత్తుల పరిమళంతో: ఇకప్పుడు
ఆ సన్నటి ధూప దారాలు సర్పాల వలే పాకి, నీ మెడకి ఉరితాళ్ళయ్యి
బిగుసుకున్న కాలమూ గుర్తొచ్చి ఉలిక్కిపడతావు. సరిగ్గా ఆప్పుడే
ఆ చెట్ల కింద, సన్నటి నీళ్ళల్లో ఎవరివో కనులు కనపడుతున్నప్పుడే
నీ మెడపై ఎవరివో మెత్తటి వేళ్ళ స్పర్స: వెనుక నుంచి, నీ చెంపపై ఎవరిదో
వెచ్చటి శ్వాస: కనిపించని పాదాలు నీ వెన్నంటే సాగే సవ్వడి-
బురదలోకి కాలి వేళ్ళు సన్నగా దిగుతూ చేసే కాలి గజ్జెల అలజడి. ఇక
ఒక జలదరింపుతో, విభ్రాంతితో వెనుకకి తిరిగి చూస్తావా నువ్వు, చల్లగా రాలుతూ
ఆకులూ, వాటి వెంట వలయాలు తిరుగుతూ ఒక గాలి: పైన ఎక్కడో ఆకాశం
ఒక నల్లటి వస్త్రాన్ని విదుల్చుతుంది, మ్లానమైన నీ హృదయంపై కప్పేందుకు. ఇక
ఆ తరువాత ఈ భూమి, నిన్ను దాచుకునే ఒక సమాధీ. ఈ రాత్రి
నీ శిరస్సు వద్ద ఉంచేందుకు, నిన్ను ఇష్టపడ్డ వాళ్ళెవరో, తమ
నెత్తురులోంచి పదిలంగా వెలికి తీసిన ఒక శ్వేతపుష్పమూనూ-
సరే. సరే. తల తిప్పి చూడు, నీ చుట్టుపక్కలా నీకు ఇరువైపులా
ఆ తుమ్మముళ్ళ చెట్ల కింది నీడలు, నిలువ నీడ లేకుండా
నిన్ను వదిలి ఎలా వెళ్ళిపోతున్నాయో!

No comments:
Post a Comment