కాఫీ తాగుతావా?
వై డోన్ట్ యు బై మీ ఎ బియర్?
పోనీ, టీ?
ఫోర్గేటిట్. నేను అడిగిన దానికి జవాబు చెప్పు ముందు-
పోనీ కలిసి డిన్నర్ చేద్దాం-
చేద్దాంలే, ఇద్దరం కలసి
ఏదో ఒకటి, ఎలాగోలాగా
కానీ వై డోన్ట్ యు బై మీ ఎ బియర్?
జస్ట్ ఎ బియర్?
ఇక అందుకని, చెరో క్రేట్
బియర్స్ తెచ్చుకుని
కూర్చుంటే, అ గదిలో
చీకటి కాగానే మొలిచింది ఒక చందమామ
ఎర్రటి కళ్ళతో, నవ్వుతో
తన తెలతెల్లటి కాళ్ళతో
నెమ్మదిగా విచ్చుకునే ఒక నెత్తురు మొగ్గై
నను గాట్టిగా కౌగలించుకుంటో. అది సరే కానీ
ఈ రక్త పిపాశుల కథ మీకు ఎందుకు కానీ
వై డోన్ట్ యు
గెట్ లాస్ట్ ఫ్రం
దిస్ white white page filled
with beers
with beers
and later
her tears?
her tears?
No comments:
Post a Comment