చాలా కాలం క్రితం: ఎంత దూరమైన కాలం అంటే, ఇంకా ఇక్కడే ఈ క్షణానే ఉండినంత దగ్గరగా ఉన్న దూరమైన కాలంలో తన ఇంటి ముందు ఉన్న బాదం చెట్టు కింద కట్టి ఉన్న రాతి వలయంపై అతను కూర్చుని ఉన్నప్పుడు ఆమెను తొలిసారిగా గమనించాడు. అది ఆమె ఉండే ఇల్లు. ఆమె కూడా అతనిని గమనించింది కానీ, పరిశీలించలేదు. ఆమె గేటు తీసుకుని బయటకు వెళ్ళిన క్లుప్త సమయంలో సుదీర్ఘంగా, సాధ్యమైనంతగా ఆమె రూపాన్ని కళ్ళతో అనువదించుకున్నాడు. ముఖ్యంగా తన వదనం
తెల్లటి తాకిడి కలిగిన కాగితం, కాగితపు మెత్తదనం కలిగిన జాబిలీ. మాట్లాడే వెన్నెల. ఆ తరువాత కనులు. వరి పొలాలు హోరున వీచే కళ్ళు. అప్పుడతను గ్రహించలేదు: తన ముందే ఆ రెండు కళ్ళూ రెండు కమిలిన నెత్తురు బావుల్లా మారి నెమ్మదిగా, మరణపు సరిహద్దుల దాకా గడ్డ కట్టుకుపోతాయని.
---కళ్ళు తెరువు. ఒక్కసారి. నువ్వెందుకు కళ్ళు మూసుకుంటున్నావు? ఒక్కసారి, కనురెప్పలను గట్టిగా తెరువు... మరణించకు, వొదిలి... వెళ్ళిపోకు...ఒక్కసారి, ఒకే ఒక్కసారి కదులు, కనీసం చేతి వేళ్ళనైనా కదుపు...ఒక్కసారి. ఒకే ఒక్కసారి---
పాలిపోయిన ముఖంతో ఆసుపత్రి గది. మందుల వాసన. అదోరకమైన అనిశ్చితమైన వాసన. ముఖానికి ఊపిరిని అందించేందుకు ప్రయత్నిస్తున్న ఆక్సీజన్ మాస్క్.నరాలలోకి దిగబడిన సూదులు. అతను పాలిపోయిన ముఖంతో తన మంచం పక్కగా నిలబడి ఉన్నాడు. అదే సూర్యరశ్మి. పల్చటి తెరలానూ, తేలికయిన బంగారపు రంగుతో, కిటికీలోంచి సాలెగూడు వలే లోపలి అల్లుకునే సూర్యరశ్మి. అదే గాలి. మృదువైన గాలి. సిక్నెస్. పరచితాపరచిత వాతావరణం. ఈ దృశ్యాన్ని ఇంతకు మునుపే ఊహించాడా? ఇంతకు మునుపే జీవించినట్టు: ఈ జీవితమంతా ఈ సమయమంతా ఈ క్షణాలన్నీ ఇంతకు మునుపే గడిపి మరొక్కసారి, లేదా అనేక సార్లు తిరిగి జీవిస్తున్నట్టు, ఒక ఘాడమైన సిక్నెస్ లాంటి అనుభూతి.
---నువ్వు కళ్ళు తెరవాలి. నువ్వు ఎలా కళ్ళు మూసుకోగలవు? నువ్వొకసారి కళ్ళు ఎందుకు తెరవవు? ఒక్కసారి, ఒకే ఒక్కసారి, నీ కనురెప్పలను ఎందుకు విప్పవు? ఒక్కసారి, ఒకే ఒక్కసారి, బలంగా గాడంగా నీ కళ్ళను ఎందుకు తెరవవు? కనులు తెరువు ఒక్కసారి, లేదా నేను వాటిని నా నెత్తురుతో తడుపుతాను నీ కనుపాపలు కనిపించేదా కా: నేనొక ఉన్మాదిని, కళ్ళు తెరువు నువ్వు, ఒకే ఒక్కసారి---
ఈ ఆసుపత్రి. ఆ గోడలు. సమాధులలోంచి నిల్చోబెట్టినట్టు. ఈ గోడలనూ, ఈ మందులనూ ఈ మంచాన్నీ ఈ ముఖాలనీ ఇంతకు మునుపు చూసాడు. చాలా చాలా దగ్గరిగా. ఎక్కడ? అతను సంఘర్చించుకున్నాడు, బలంగానూ అసహనంగానూ అశాంతిగానూ, ఈత రాక నీట మునుగుతూ ఊపిరికి తన్నుకులాడే మనిషిలాగా.
నాకు అబార్షన్ అయ్యింది: ఒకసారి. నాన్నకు తెలియదు. ఏం జరిగిందో, నాకూ తెలియదు. అన్నయ్య స్నేహితుడు . రాత్రి. అమ్మా నాన్నా లేరు. నిశ్శబ్దం. బాధ కూడానూ. అతను...నాకు ఏం జరుగుతుందో కూడా తెలీలేదు. నొప్పి ఒక్కటే. ఇప్పుడు కూడా నొప్పే తలచుకుంటే...ఆ చీకటి భయం. ఇప్పుడు కూడా, రాత్రి పూట అప్పటిలాంటి చీకటి చుట్టుకుంటే భయం వేస్తుంది. బాధ వేస్తుంది. నొప్పి కూడానూ. ముఖ్యంగా ఆ ఆసుపత్రి గదులు, ఆ మందుల వాసనా, మరీ ముఖ్యంగా ఎదగని పిండం: ఇంకా చేతులూ కళ్ళూ కాళ్ళూ సరిగ్గా ఏర్పడని పిండం. అప్పుడిక నేనే ఒక పిండం అయ్యీ...
ఒక లేత స్పర్శ. ఒక చెమ్మగిల్లిన నయనం. బరువుగా జారిన కన్నీటి చుక్కలు కూడానూ. మరి అతను ఏం చేసాడు? అతని ఎదురుగా కూర్చుని, తన గాయాల్ని ఆమె అతని ముందు విదిల్చినప్పుడు అతను ఏం చేసాడు? ఆమె మౌనంగా తల వంచుకుని, ఆ చెట్ల కింద, ఆ నీడలలో ఎక్కడో కలుక్కుమంటున్న నొప్పితో మౌనమైనప్పుడు, తనే నీడ లేని ఒక చెట్టుగా మారిపోయింది. అతను ఆ గాయాల వృక్షం కింద కూర్చుని తల ఎత్తి ఆమె వైపు చూసాడు: అవే కళ్ళు. కళ్ళల్లో అవే నదులు. ఆ నదులలో తేలిపోతున్న తన శరీరం. సంతోషాన్నీ దుక్కాన్నీ విషాదాన్నీ బాధనీ అంతం లేని నొప్పినీ, శరీరంపై జరిగే అత్యాచారాల్నీ, శాంతినీ అశాంతినీ, అసంఖ్యాక కోతల్నీ చంపుకోలేని ప్రేమల్నీ వొదులుకోలేని మనుషుల్నీ, గాయపరచ లేని ప్రియుళ్ళనీ ఇంకా అనేకానేక విషయాలని దాచుకున్న శరీరం. విషయాలయ్యిన శరీరం. ఆ శరీరం ఒక యుద్ధ ప్రదేశం. అల్లకల్లోలమైన ఒక సముద్రం. మరొక రోజు మరొక సమయంలో ఉద్వేగంగా శాంతిగా కాంతిగా కదులాడే ఉషోదయపు సూర్యరశ్మి: తన శరీరం.
---నువ్వు ఎలా తీసుకోగలవు ఇంత దుక్కాన్ని, నీలోకీ, నీ శరీరంలోకీ?---
ఒక నగ్న దేహం మధ్యాహ్నపు సూర్య కిరణాల వొత్తిడికి అతని పక్కగా కదిలింది. ఒక చిరునవ్వులా కూడానూ. తన చేయి చల్లగా అతడిని దగ్గరగా హత్తుకుంది. దగ్గరగా. మరింతగా దగ్గరగా, ఎంతగా అంటే తన రక్తంలో కలుపు కునేంతగా: తను ఇలా అంది అతనితో.
నన్ను వదలకు. నన్ను వొదిలి వెళ్ళకు. నాకు ప్రేమభరితమైన జీవితం లేదు. నాకు ప్రేమ కావాలి: రోజూ. నన్ను నన్నుగా , నా శరీరాన్నీ నన్నూ, ఈ పెదాలనీ పాదాల్నీ పదాలనీ ప్రేమించు. నన్ను వొదిలి వెళ్ళకు. నేను ఎవరిని నమ్ముకుంటాను? నమ్మిన ప్రతీసారీ గాయపడ్డాను. తిరిగి కోలుకోలేనంతగా, తిరిగి ఈ లోకం లోకి రాలేనంతగా తిరిగి మనుషులపై ప్రేమనూ, నమ్మకాన్నీ పెంచుకోలేనంతగా గాయపడ్డాను. శ్రీ, నేను మనుషులని నమ్ముతాను. నేను మనుషులని ప్రేమిస్తాను. ఇన్ని గాయాలు నా శరీరాన్నీ హృదయాన్నీ కోసివేసినా నేను జీవితాన్నే నమ్ముతాను. నిన్ను ప్రేమిస్తాను. నన్ను వొదిలి వెళ్ళకు-ఎన్నటికీ.
మరొక రోజు. మరొక సమయం. మళ్ళా తన శరీరం నిండా లెక్క లేనన్ని కోతలు. అతడు ఆ వేళ వాటిని లెక్క పెట్ట దలుచుకున్నాడు. తన గాయాలలోంచి పూల సుగంధాల సీతాకోకచిలుకలని నిర్మించి ఇవ్వదలిచాడు. కానీ అన్నిటి కంటే ముందు ఒక ప్రాధమిక ప్రశ్న: ప్రేమ అంటే ఏమిటి? అదొక కాలమా? అదొక భాషనా? అదొక నిశ్శబ్ధమా? రేపు - ఒకప్పుడు మనం బ్రతికి ఉన్నామని- గురుతు చేసుకునేందుకు, మనం ఇప్పుడు చేసుకునే ఒక గాయమా? అతని తోచలేదు. గాయాలలోంచి ఒక ఇళ్ళు నిర్మించి ఇవ్వడం ఎలాగో, ఇంటికి రెక్కలు తొడిగి, మృదువుగా నిమిరి అలా గాలిలోకి వొదిలి వేయడమెలాగో అతనికి తోచలేదు. తను అడిగినది ఎలా ఇవ్వాలో, ఎలా సాధ్యమో తెలియక అతనికి దిక్కు తోచలేదు. అతను, తెలుసునేందుకు ఆమెని వొదిలి, ఆమెను మళ్ళా గాయపరచి పారిపోక మునుపు ఆ ముస్లిం గులాబి ఇలా కూడా అంది:
మనుష్యులని ప్రేమించకుండా నేను ఉండలేను శ్రీ. నాకు తెలియదు ఎందుకో కానీ, ప్రేమించకుండా, ప్రేమించి గాయపడకుండా నేనుండలేను. నేను మనుష్య్లని ఇష్టపడతాను: వాళ్ళ వైరుధ్యాల తోటీ, విశ్వాసఘాతాల తోటీ, వాళ్ళ నిర్ధయాల తోటీ, ద్రోహాల తోటీ నేను వాళ్ళని ఇష్టపడతాను. శ్రీ, నిన్ను ఇష్టపడతాను. నువ్వు నా పట్ల చూపించే ప్రేమా కన్సర్న్ రేపు ఉండక పోవచ్చు. రేపు నువ్వు నన్ను ఇంత ప్రేమగా రమించక పోవచ్చు. ఒట్టి శారీరక సంబంధం మాత్రమే మన మధ్య ఆఖరి వెలుతురై ఊగిసలాడుతుండవచ్చు. అది ఎప్పటికీ సాధ్యమే: ఎప్పటికీ శాశ్వతమైన సంబంధాన్ని నేను ఊహించ లేను. కానీ, ఆశించడం? ఎలా దీనిని ఆపడం?
---కనులు తెరువు. మరణించకు. ఒక్కసారి కనులు తెరువు. చూడలేను ఈ తెల్లని గోడలు. కాంచలేనీ కరుణ లేని పడకలు. వెళ్ళకు. ప్లీజ్ స్టే. ఒక్కసారి కళ్ళు తెరువు---

రక్తం కావాలి. ఈ శరీరం కోసం. మనుష్యులని ఇష్టపడి కోసుకున్న శరీరం కోసం. మరొక రోజు, మరొక సమయంలో ఆమె కడుపులోని బిడ్డ వాంతి చేసుకున్నప్పుడు, ఆ ద్రవం తన జీవితం లోని అయిస్టాభరిత వైవాహిక సంబంధంలా ఊపిరి తిత్తుల్లోకి ప్రవేశించినప్పుడు, వొకే ప్రశ్న. ఒకే ఒక్క ప్రశ్న. తను బ్రతుకుతుందా లేదా? మూసుకున్న కళ్ళను అలాగే కప్పి ఉంచుతుందా?
నా భర్త. బహుశా, ప్రేమిస్తాడేమో నన్ను. కానీ ధైర్యంగా నాకై ఉండలేదు. భయస్తుడు. నేను అతడిని ప్రేమిస్తున్నానా? లేక అంగీకరించడానికి అలవాటు పడిపోయానా? దేహమొక్కటే అప్పగిస్తున్నానా? ఏమో? ఇష్టపడుతుండవచ్చు. అతనితో అనుభవాన్ని అప్పుడప్పుడూ ఇష్టపడతాను కనుక. అతని తల్లి, ఒక ఫ్రస్తేటడ్ వుమన్. ఆయక్త అయిష్ట భరిత, అశాంతి భరిత జీవితాన్ని నాపై చూపిస్తుంది. నేనూ మనిషిననీ స్త్రీ ననీ తనకి అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుందనుకో, ఒక నిర్లిప్త నిస్సహాయ సమయ రహిత సమయంలో--- కానీ తను మాత్రం ఏం చేయగలుగుతుంది? పాతికేళ్ళ యంత్రపు జీవితం, పాతికేళ్ళ యంత్ర దినచర్యలతో?
అవన్నీ సరే కానీ ఇప్పుడు రక్తం కావాలి. ఆమె హృదయం మరి కొంత కాలం ఉండేందుకు రక్తం కావాలి. బి పాజిటివ్. ఆసుపత్రిలో రక్తం లేదు. కొనుక్కు రావాలి. ఎక్కడైనా త్వరగా. అందరూ ఉందీ ఎవరూ లేక మిగిలిపోయిన తనకి ఇప్పటికిప్పుడు రక్తం కావాలి. బి పాజిటివ్. మూడు రాత్రుళ్ళు కొట్టుకులాడుతున్న గడులలోంచి బయట పడేందుకు తనకి రక్తం కావాలి. ఆనక చెబుతుంది తను జీవితం గురించి. ప్రేమ గురించి. ఈ జీవన సంక్లిష్టతల గురించి. ఉద్వేగం గురించీ, శాంతి అశాంతుల గురించీ. కానీ ముందు ఆమెకి రక్తం కావాలి. బీ పాజిటివ్. మంచాపై అలా పడిపోయి తను - చెట్లనూ, మొక్కలనూ వానలనూ మనుష్యులనూ జంతువులనూ ప్రేమలనూ ప్రేమ ఘాతుకాలనూ ఇష్టపడిన ఆమె శరీరం రక్తంకై, తిరిగి ఈ భూమిపైకి వచ్చేందుకు ఒక ప్రార్ధన చేస్తుంది:
తను తిరిగి ఇక్కడికి రావాలి. తిరిగి ఈ మనుషులని ప్రేమించాలి. తిరిగి గాయపడాలి. మళ్ళా ఇష్టపడాలి. మళ్ళా చావు బ్రతుకుల్లో కొట్టుకులాడాలి. అందుకు ముందు రక్తం కావాలి. బి పాజిటివ్. ఎక్కడైనా కొనుక్కు రావాలి. త్వరగా. తిరిగి తను ఈ మట్టి పైకి రప్పించేందుకు, ఈ మట్టిపైనా ఈ జీవితాలపైనా తన పద పాద స్పర్శ మోపేందుకూ, ఈ మనుషులని మరింతగా అనువదించుకునేందుకూ, తనకి రక్తం కావాలి. కొద్దిగా. బి పాజిటివ్. చూడు. ఒక శరీరంతో అధ్బుతాలు చేయ వచ్చు. సంభాషించ వచ్చు. ప్రేమించ వచ్చు. ముద్దాడ వచ్చు. రమించ వచ్చు. నిన్ను నీవు ఒక స్పర్శ లా మార్చుకుని తనని తాక వచ్చు. అనేకానేక విషయాలను సాధ్యం చేయ వచ్చు. తను: ఆ చేతులూ పెదాలూ పాదాలూ కనులూ తొడలూ చేతి వేళ్ళు తిరిగి ఈ భూమిపై కదులాడాలంటే ముందు రక్తం కావాలి. అత్యవసరంగా రక్తం కావాలి.
చదువరీ, ఇవ్వగలవా నువ్వు కొంత రక్తం, తనని చూచేందుకూ, మరింత జాగ్రత్తగా తనని గమనించేందుకూ తనని ప్రేమించేందుకూ, తనని బ్రతికించుకునేందుకూ?
------------------------------------------------------
26.09.1997
No comments:
Post a Comment