ఈ వేళ నువ్వు మాట్లాడితే, నీ గొంతంతా జీర, మరి బరకు బరకు వానానూ-
నీ ముఖం ఉబ్బి, ముక్కు చివర్లు ఎర్రగా మారి లోకంపై రుసరుసలతో
మరి ముంజేతితోనో, చేతిలో రుమాలుతోనో
క్షణక్షణానికీ నీ ముక్కు తుడుచుకుంటో నీ
ముక్కు ఎగబీల్చుకుంటో - అయ్యో అయ్యయ్యో - పాపం నువ్వు అలా
నానా అవస్థలు పడుతుంటే
ఒకటే ఆనందం నాకు.ఒకటే
ఆగకుండా నవ్వు నాకు. మరి ఇక నువ్వు తుమ్మితే, నీ ముక్కులోంచి
తుళ్లిన మేఘాలు నీ
చెంపలపై నీ పెదాలపై
కురిసి, అది చూసి పకాల్మని వికటాట్టహాసం చేసే నన్ను చూసి మరి
నీకు నన్ను కరిచేయాన్నంత కోపం వస్తే
మరి ఏం చేయను నేను, నిన్నిలా చూస్తో
నా తెలుగు భావుకత్వపు కవులను తలచుకుంటో? అమ్మాయీ, మరేం
పర్వాలేదు, నేనిలా రాస్తే నీ
అందమేమీ చెడిపోదు. మరి
అయతే, గియితే ఇంకా కొద్దిగా ద్విగుణీకృతం అవుతుందే కానీ తగ్గేంపోదు.
అమ్మాయీ, నీదీ శరీరమే నీ
దీనూ శరీరపు అవస్థలే.మరి
అందులో తప్పేమీ లేదు. నేను పడీ పడీ నవ్వితే కోపగించుకోడానికేమీ లేదు-
మరి, నా చీమిడి ముక్కుల వెన్నెలా
ఇదిగో ఈ మహాస్ట్రాంగ్ అమృతాంజన్
ఇన్ని వేన్నీళ్ళలో వేసుకుని, కూర్చుని నువ్వు ఆవిరి పట్టుకునేందుకు. అందుకే
ఇక అదయ్యేదాకా మర్నామీదా
ఈ లోకం మీదా ఈ కాలం మీదా
ఆగకుండా, అరుచుకుంటూ విసుక్కుంటూ నిన్ను నువ్వు చీదుకుంటూ చికాకుతో
అలా చీమిడి తుంపరలతో
తుమ్ముతూ రాలిపడకు-!

No comments:
Post a Comment