ఉదయం అంటే ఎంత ఇష్టం నీకు!
బాల్కనీ తలుపు తెరిచి, వేకువ గాలిని లోపలి పిలిచి ఒక కప్పు తేనీరుతో
బాల్కనీలోని పిచ్చుకల్తో మాట్లాడటం ఎంత ఇష్టం నీకు
ఎండ నీ లోగిలిలో వాలిన వేళ, దాని రెక్కల్ని తాకుతూ
చల్లటి గాలికి చేతులు కట్టుకుని, నీలోకి నువ్వే ముడుచుకుని
ఆకాశాన్నీ, గాలిలో పరిమళమై వ్యాపించే కాంతినీ
రంగులు మారే చెట్లనీ, వాటిపై కరిగిపోయే తేమనీ
కుండీలో నిన్నటి కంటే కొద్దిగా పెరిగిన మొక్కలనీ, వాటి చిగురాకులపై
మృదువుగా నీ చేతివేలితో రాస్తూ, వాటిలోని కొంత ఆకుపచ్చదనాన్నీ
కొంత ప్రాణాన్నీ మాకై కొంత నీలోకి నింపుకుని నీ
కళ్ళలోకి తొంగి చూసే ఈ మబ్బులను కడుక్కుని
నెమ్మదిగా లోపలి వచ్చి పిల్లలని నిద్ర లేపడం
వాళ్ళు మగత నిద్రలో, నిన్ను తమ చేతులతో
దగ్గరగా లాక్కుని కౌగలించుకోవడం, వాళ్ళ చేతివేళ్ళల్లో ఇరుక్కున్న
నీ శిరోజాలని చిరునవ్వుతో విడదీసుకుని అలా
వాళ్ళని తృప్తిగా ముద్దాడటం, ఎంత ఇష్టం నీకు. ఎంత ఇష్టం నాకు!
చూడూ, ఉదయం నువ్వు బాల్కనీలో వేయడం
మరచిన బియ్యపు గింజలకై
లోపలి వచ్చిన ఆ పిచ్చుకలు
ఒకటే కిచ కిచ, వాటి చిట్టి చిట్టి పాదాల హడావిడి డైనింగ్ గది అంతా-
పద పద పద తొందరగా, మరి కొద్దిసేపట్లో
నిదుర లేచిన ఇంకో మూడు పిచ్చుకలు
ఇక నీ పాదాల చుట్టే తిరుగుతాయి, ఇన్ని గింజలకై, నీ పట్లా జీవితం పట్లా
మహా కృతజ్ఞతతో 'అమ్మా' అంటో వాళ్ళు
'అమ్మాయీ' అని అనుకుంటో మరి నేను
చిన్నగా సన్నగా ఒద్దికగా బుద్ధిగా నీ చుట్తో
తెల్లటి నల్లటి పూల చెండుల పిల్లి పిల్లలమై-

No comments:
Post a Comment