'లాస్ మెస్ ద్రియోస్' అంటే కోరిక అని అర్థం,'లాస్ మెస్ ద్రియోస్' అంటే ప్రేమ అని అర్థం
'లాస్ మెస్ ద్రియోస్' అంటే ప్రేమతో కూడిన కోరిక అని అర్థం - అని తను- చెప్పింది కానీ
అది అంటే ఏమిటో ఇప్పటికీ అర్ధం కాలేదు నాకు:
ఆకుపచ్చని నక్షత్రాలు మెరిసే తెల్లటి ఆకాశాల్లా ఉండేవి తన కళ్ళు. మరి
చూసావా వాటిలోకి, సరస్సుల్లోకి రాలి
దారీ తెన్నూ లేకుండా కొట్టుకుపోతావ్
వానా వెలిసాక, ఆకుల చివర్ల నుంచి రాలే నీటి చుక్కలు ఆకస్మికంగా నీ
ఒంటిపై పడి, ఒళ్ళు జలదరిస్తుంది చూసావా
ఆలా ఉంటుంది తను నిన్ను తాకినప్పుడు
దారి పక్కగా వాన వెలిసిన నీటిలో మొలిచే
బుడగలలోకి బుడంగున మునిగి ఆరంగుల
లోకాలలో తిరిగి తిరిగి నిన్ను నువ్వు కోల్పోయినట్టు ఉంటుంది, మరి తను
అలా అలా మాట్లాడుతుంటే వింటున్నప్పుడు
పచ్చని చేలల్లో పంట కాల్వల పక్కగా నిలబడి
రివ్వున దూసుకువెళ్ళే గాలి పిట్టల రెక్కల సవ్వడిని చూసినట్టూ, పున్నమి
శీతల రాత్రుళ్ళలో దివి నంచి భువికి అల్లుకున్న
మంచుపొరలను ఒక చలిమంటతో రగులుతూ కాచుకుంటున్నట్టూ ఉంటుంది
మరి తను నిన్ను గాట్టిగా చుట్టుకున్నప్పుడు
ఇక కల్లు తాగిన కోతి పరిస్థితే నీది, తను నిన్ను
ముద్దు పెట్టుకున్నప్పుడు. నిలకడగా నిలువాలేవు నింపాదిగా నడవాలేవు
భూమి తిరుగుతూ విశ్వం తిరుగుతూ
తల కూడా తిరుగుతూ ఇక నువ్వు నీ
హృదయాన్ని చేతిలో పట్టుకుని వీధులన్నీ తిరుగుతావు - 'చూడండి. ఎవరికీ
తెలుసీ కళ?' అంటో, కవితలని రాస్తో. ఇక
ఒక రాత్రి తనతో నువ్వు, నీతో తనూ అలా
పడుకున్నప్పుడు, నీ ఆ గదిలో అరణ్యాల అలజడి. రహస్య లోకాల నీడల సవ్వడి.
అనంత దీపాలు వెలిగి, అనంత కాంతి ఖగోళాలు
రగిలి, భూమి పిగిలి పర్వతాలు పగిలి, వేనే వేల
వెదురు వనాలు వానలో ఆకు పచ్చి సంగీతమై
తనలోనూ నీలోనూ వ్యాపించి, ఇక ఊగుతోంది
తొలి నిదుర, కమ్మటి పాల వాసనతో, ఛాతి వాసనతో తొడల వాసనతో తొలకరి
వాసనతో, కనుల పాదాల వెన్నుముకల వెన్నె
లాంటి మెరుపుల పరిమళంతో, ఒక నివేదనతో-
'లాస్ మెస్ ద్రియోస్' అని తను అప్పుడు నీ చెవిలో
సన్నగా నవ్వుతూ నెమ్మదిగా గొణుగుతుంది కానీ
వానకి తాళలేక, గూటిలో ఒదగాలేకా నేలపై రాలి, చనిపోయిన పిచ్చుక పిల్లల
నానిన నిశ్శబ్దం ఇక నీ చుట్టూతా తను వెళ్ళిపోయాక
ఇక చెట్లల్లో, కొమ్మల్లో హడావిడిగా పిచ్చి పిచ్చిగా అరుస్తాయి పక్షులు రాలిన
పిచ్చుకపిల్లలపై గిరికీలు కొడుతూ - చెట్టు వద్దే దాని
బెరడును రాసుకుంటూ అసహనంగా తిరుగుతోంది ఒక పిల్లి అరుచుకుంటో
ఎక్కడో ఎవరో దబ్బున రాలిన శబ్దం. మరణించిన
దేహాన్ని పాడెపైకి చేరుస్తున్న నిశ్శబ్ధం.శ్మశానంలో
సరిగ్గా ఎండని కర్రలని దహించే నిప్పుల కలకలం
అజగారం వలే నీ చుట్టూతా పాకే పొగ, కళ్ళను కాటేసే పొగ, నీ ఛాతిని చీల్చి నీ
గుండెకాయని పెగిల్చి నీ అరచేతుల్లోనే ఉంచే పొగ-
ఏడవా లేవు శపించనూ లేవు చెప్పుకోనూ లేవు తప్పించుకోనూ లేవు మరి
పారిపోనూ లేవు ఆ 'లాస్ మెస్ ద్రియోస్' గాజుల
ఉరితాళ్ళల చప్పుళ్ళ వలయాలలోంచి: ఇక, ఒక
దినానంతాన, శ్వేతమయమైన ఆకాశం కింద కూర్చుని, అదొక శరీరం అయినట్టూ
అదొక స్త్రీ అయినట్టూ, పదిమందికీ ఖాళీ కుండలా
మారిన నీ హృదయం లేని ఛాతిని చూపిస్తూ ఇలా
నీలో నువ్వు గొణుక్కుంటావు: 'లాస్ మెస్ ద్రియోస్' అంటే ఒక ఖననం 'లాస్ మెస్
ద్రియోస్' అంటే ఒక జననం. 'లాస్ మెస్ ద్రియోస్' అంటే ఆకుపచ్చని గోళీకాయల
కనులున్న సర్పకన్యలు చేసే విన్యాసం. 'లాస్ మెస్
ద్రియోస్' అంటే దేవతలు మానవులతో చేసే పరిహాసం
పరిహారం లేని వేట వినోద చాతుర్యం. విన్నారా మీరు
ఇంతకు మునుపు ఇలా 'లాస్ మెస్ ద్రియోస్' లాస్ మెస్ ద్రియోస్ లాస్ మెస్ ద్రియోస్'...

No comments:
Post a Comment