ఈ వేళ ఒక నలుపు షర్టుతో, ఒక నలుపు పాంటుతో
నల్లని సూర్యుని కింద, నల్లని పదాలతో నేను - ఆహ్.
ఏమిటంటావా ఇది?
ఏమీ లేదు. నిట్ట నిలువునా చీలిన ఛాతిలోకి ఒక బిందువు
రాలిపడి, ఇక అంతా
వలయాల ప్రకంపన.
ఏమిటా అని శరీరంలోకి తొంగి చూడకు, చివరికి
ఈ నెత్తురు చుక్కలూ
ఓపలేని నల్లటి సెగలై
దహించుకుపోయి, ఎగసిపోయే బూడిద రేణువులైనాయి:
(-ఇంతకూ
నువ్వు అనుకుంటున్న వాళ్ళు, ఎవరూ లేరిక్కడ
శతాభ్ధాల కరుణ ముద్రికతో-)
ఇక ఆపై ఏమౌతుందో ఎవరికీ తెలుసు?

No comments:
Post a Comment