26 February 2011

జంతువులు ||collage poems*6||

*


వొంటరిగా వొదిలివేయండి నన్ను, ఒక చిహ్నమై
వెంటాడుతాను నిన్ను:

సంజ్ఞలు, ఆ సంజ్ఞలు ఎదిగాయి సహజంగా
మానవుల ప్రమేయం లేకుండా

ముట్టుకోకు. కృతజ్ఞతలు భగవంతుడా, వాళ్ళు
ఏం చేస్తునారో వారికి ఇక
ఏమాత్రం తెలియదు

అస్థవ్యస్థ, వ్యాకులత నిండిన ప్రపంచం వాళ్ళది
అవిరామంగా, నిదురరహితంగా
పర్యాయీకరణం అయ్యే క్రమం వారిది
చీకటిలో గడిపే
సంపూర్ణ ఆటవిక జీవితాలు వాళ్ళవి


ఇకనైనా రండి, నా ఊదా రంగు వర్షంలోకి=
_____________________________
* the above gesture,-the animal scientists say- which has become common and recurring practice/habitual gesture among monkeys convey the meaning "leave me alone or do not bother me." photo courtesy nationalgeographic.com

No comments:

Post a Comment