02 February 2011

చరిత్ర**

నిదురపట్టక రాత్రుళ్ళు నడుస్తూ ఉంటాను=

అప్పటికి నాలుగు కిలోమీటర్లు నడిచి ఉంటాను
ఆమెతో, ఆమె చరిత్ర వినడానికి:
ఆ తరువాత ఒక కవిత్వం పుస్తకం తెరుస్తాను.

పుస్తకం మధ్యగా
అతడు ఉంచుకున్న ఖాళీ కాగితం కనిపిస్తుంది:
ఏదైనా కవిత తడితే రాసుకునేందుకు
అతడు తరచూ కొన్ని తెల్లటి కాగితాలను
పుస్తకం మధ్యలో మడచి ఉంచుతాడు.
ఈ కాగితం అదే కావొచ్చు
అతడు పుస్తకంలో మరచి ఉండవచ్చు.

ఇక నేను ఆ కాగితం అందుకుని
ఈ పదాలను రాస్తాను: ఎలా అంటే,
ఆమె నన్ను బయటకు లాగి
నాలుగు పదాలు రాసేందుకు ప్రయత్నించినట్టు=

1 comment: