24 February 2011

ఏమీ తోచని రాత ఒకటి/ బావోలేని కవిత ఒకటి

((నువ్వొకసారి ఇటు వస్తే, నీతో కాసేపు
గడుపుతాను))

((వచ్చినా, రాకపోయినా
ఏం చేస్తాం మనం))

పదాలు, కొన్ని పదాలను మన ముందు పరుచుకుంటాం: మనం
నింగీ, నేలా మన కన్నీటి నీరూ నిప్పూ
కలగలసిన పదాలని ఎంచుకుని
వాటితో ఒక దండను తయారు చేసుకుంటాం: మనం
మన హృదయంలో, మన రక్తంలో ఒక చిహ్నంలా
దానిని ధరిస్తాం: మనం. చిహ్నాలని తిరిగి సంజ్ఞలుగా మార్చి
కాగితాలపై, హృదయాలపై ముద్రిస్తాం: మనం.

((నువ్వొకసారి ఇటు వస్తే, నీతో కాసేపు
గడుపుతాను
నువ్వొకసారి ఇటు రాకపోయినా, నీతో
మీతో కాసేపు గడుపుతాను నేను))

1 comment: