18 February 2011

ఆది రూపం || collage poems* 3||

బొనోబో: స్త్రీత్వపు ఆది రూపం అది

నీకొక నీదైన అంగం కావాలా?

తీసుకు వెళ్ళు, నా హృదయాన్ని
ఒక ప్రాచీన సమాధిని=

ఆదిమ గుహలలోంచి
వెలువడతారు ఇద్దరు, ముగ్గురుగా

నీలినిప్పుల దుస్తులలో అతడు
పొడుగాటి కాళ్ళతో
నిండైన కనులతో, జ్వలించే ఒక
రాత్రి లాంతరుతో ఆమె

అస్వస్థత కలిగించే
ఒక చీకటి విరజిమ్మే
నల్లటి పరిమళంతో

వెలువడతారు ముగ్గురు
ఇద్దరుగా=

చీకటిలోంచే వస్తుంది
ఒక చిన్న యేరు, కరకర ధ్వనులతో
ప్రాచీన నిర్మాణాలతో
ప్రాచీన శకలాలతో=

ఉత్తినే చెట్ల గురించి ఆలోచించు:

చెట్లు, కూర్చున్న పక్షులతో
ఎగిరిపోయే పక్షులతో
శీతాకాలంలో నక్షత్రాలకింద
అలా మిగిలి ఉన్న చెట్లు=

ఆ తరువాత నీ మీదుగా
ఆ ఏడు నక్షత్రాలు
నిర్మలమైన అరణ్యం మీదుగా సాగిపోతాయి.

____________________________________________________________

bonobo: the alpha female. The term alpha female originated in field of animal behavior, but has acquired new meaning. It refers to women who are in charge, for example, by flirting and dating on their own terms.The original meaning of "alpha female," however, is exactly the same as that of "alpha male": being the highest ranking member of one's sex.

An Alpha Female is a dominant female in a group. She dates as many males as she wants, is strong and confident, and a hard worker as well as often busy. She is usually sarcastic because she's powerful and playful. Alpha Females are intelligent, intellectual problem solvers; and though being an alpha female is more of a state of mind than a physicality, an alpha understands that dressing up or sexy increases her power in society, so she does it.

+* much theoritical information can be found about alpha females on web=*

1 comment:

  1. beautiful. but i hope you are not starting a dangerous trend.

    ReplyDelete