నీ పేరుని తలుచుకుంటూ
నిదుర లేచాను నేను
పర్వతాలనుంచి రాలిపడే రాళ్ళు
క్షణకాలం, తమని తాము
ఆకాశంలో చూసుకుంటాయి.
సముద్రాన్ని చేరావు అవి
ముక్కలు చేయబడ్డ ప్రదేశాలు
ఇక్కడ జీవించే మనుషులు
అంతరాయం లేకుండా కదులుతారు
నా లోపల మరణించి
మరెవరో కల్పించిన గాధలై=
ఒక దిగులు చుట్టుకుంటున్నది
నా హృదయంలో
ఆమె చేతులలోంచి
తప్పించుకున్న ఒక పిచుక
గూడు కట్టుకుంటున్నది
నా శరీరంలో
జ్వలిస్తున్న కాంతితో
ధృడమైన కోరికతో=
ఆమెకు ఎలా సాధ్యం? అలా
భాష చర్మాన్ని విప్పి
ప్రపంచాన్ని ప్రవహింపచేయడం?
ఆమె తన చేతిని అందిస్తుంది
ఇక నేను గాలిలోకి తేలుతాను
ఈ అవిశ్రాంత రాత్రి చదరపు గదిలో
నేను బ్రతికి ఉంటాను=
***
No comments:
Post a Comment