19 February 2011

వీడ్కోలు ||collage poems*4||

వీడ్కోలు, వచ్చినందుకు
ధన్యవాదాలు

పుష్పించే నీరు, ఆ ప్రాచీన
వాన
గాలిలో తేలే ఆమె ముఖం
రాలిపడే ఆకులూ

నువ్వు ఊరికినే, ఈ చితాభస్మాల
మధ్య తిరుగాడతావు

ఎవరో ఉన్నారు ఇప్పుడు
నీ పక్కగా శ్వాసిస్తూ
ధూళి నిండిన కలలతో=

నువ్వు కోల్పోయిన హృదయం
ఇక వొంటరి గదులలో
ప్రతిధ్వనిస్తుంది
నీ కన్నీటి చుక్కలో మెరిసే
ఆమె పదాలతో=

ఇక నేను వెళ్ళాలి

వీడ్కోలు, వచ్చినందుకు
ధన్యవాదాలు

1 comment: