మనుషులతో నివశించేందుకు పెంచబడ్డ
అడవి మృగం అది=
ఎలా ఉన్నావు నువ్వు? అన్నిటికీ
వాటన్నిటికీ మానవ స్పర్స కావాలి
నా చేతులలో ఊయలలూగుతూ
నా చేతిని తన నోటితో నములుతూ
అది నా పెంపుడు కుక్కవంటి
విధేయతతో ఉంటుంది
సంభవించబోయే ఒక సహవాసంచే
నియంత్రిపబడి
చాలామంది నియంత్రణని ఖచ్చితంగా
నిర్వచించటం మరచారు
కానీ, ఈ క్లిష్టమైన కధనం
మరింత ఆసక్తికరంగా ఉంటుంది
ఆహ్వానించండి= అంత్రోపొసీన్
మానవ యుగాన్ని
దుష్టమైన విషయాలు ఘటించాయి
ఇక్కడ=మహా
నగరాల నిర్మాణం జరిగింది ఇక్కడ
ఉక్కూ సిమెంటూ
మిశ్రితమైన ఒక విధ్వంసపు అద్దం
నిర్మాణం అయ్యింది ఇక్కడ
గుర్తుంచుకో: త్వరలో నువ్వు
అద్దంలోంచి వదనంగా పగులుతావు
ఇక తిరిగి ఇంటికి
ఎన్నడూ తిరిగి రావు=
No comments:
Post a Comment